రోడ్డు ప్రమాదంలో.. నిర్మాత మృతి..!

| Edited By:

Dec 01, 2019 | 4:06 PM

రోడ్డు ప్రమాదంలో.. ఓ వెటరన్ నిర్మాత మృతి చెందారు. రణధీరుడు, మళ్లీ ఇంకోసారి, రౌడీ లాంటి చిన్న సినిమాలను తీసిన తోట రామయ్య అనే నిర్మాత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు భార్య వసుంధర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన నవంబర్ 29వ తేదీ జరిగినా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 29వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో.. సికింద్రాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కాగా.. ఆయన […]

రోడ్డు ప్రమాదంలో.. నిర్మాత మృతి..!
Follow us on

రోడ్డు ప్రమాదంలో.. ఓ వెటరన్ నిర్మాత మృతి చెందారు. రణధీరుడు, మళ్లీ ఇంకోసారి, రౌడీ లాంటి చిన్న సినిమాలను తీసిన తోట రామయ్య అనే నిర్మాత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయనకు భార్య వసుంధర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన నవంబర్ 29వ తేదీ జరిగినా.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవంబర్ 29వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో.. సికింద్రాబాద్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కాగా.. ఆయన అంత్యక్రియలను బన్సీలాల్ పేటలోని స్మశాన వాటికలో జరపనున్నట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. కాగా.. ఈ మధ్యకాలంలో.. టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. హీరో రాజశేఖర్.. కారు పెద్దగోల్కొండ వద్ద.. బోల్తా పడటంతో.. గాయాలపాలయ్యారు.