
Riteish Deshmukh Diwali: ఈ మధ్య ఫ్యాషన్ రంగంలోనూ రీసైక్లింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పాత దుస్తులకు కొన్ని హంగులతో కొత్త వాటిగా తయారుచేస్తుంటారు. ఇప్పుడు ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ కూడా అలానే చేశారు. తన తల్లి వైశాలి దేశ్‌ముఖ్ పాత చీరతో పిల్లలకు కొత్త బట్టలు తయారు చేయించారు రితేష్. (తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవమిది.. గోరెటి వెంకన్నపై కేటీఆర్ ట్వీట్)
దీపావళి సందర్భంగా అందరికీ విషెస్ చెబుతూ రితేష్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ముగ్గురు ఒకే రంగు కలర్ డ్రస్‌లతో, ఒకే డిజైన్‌తో కనిపించారు. ఇక ఆ వీడియోకు అమ్మ పాత చీరతో దీపావళి రోజున పిల్లలకు కొత్త బట్టలు వచ్చాయి అని కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోను రితేష్ భార్య, నటి జెనీలియా తీశారు. ఈ వీడియోకు సూపర్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (శబ్ద, వాయు కాలుష్యానికి నా వంతు బాధ్యత నిర్వర్తించా.. వర్మ దీపావళి సెలబ్రేషన్స్)
माँ की पुरानी साड़ी, बच्चों के लिए दिवाली के नए कपड़े। Happy Diwali …. shot by Baiko @geneliad – Song credit @sujoy_g #Recycle pic.twitter.com/hfSvLBXdjG
— Riteish Deshmukh (@Riteishd) November 14, 2020