పెళ్లిపై అభిమాని ప్రశ్న.. డైరెక్ట్‌గా వచ్చి కలిస్తే చెప్తానన్న నటి

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. అక్కడ తన సినిమా అప్‌డేట్‌లను ఇవ్వడంతో పాటు

పెళ్లిపై అభిమాని ప్రశ్న.. డైరెక్ట్‌గా వచ్చి కలిస్తే చెప్తానన్న నటి

Edited By:

Updated on: Sep 23, 2020 | 6:08 PM

Rashmika Mandanna Chitchat: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. అక్కడ తన సినిమా అప్‌డేట్‌లను ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్‌తో అప్పుడప్పుడు ఈ బ్యూటీ చాట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల పలువురు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఇక ఈ కన్వర్జేషన్‌లో ఓ నెటిజన్ మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు..? అని ప్రశ్నించారు. దానికి తనదైన శైలిలో ప్రాక్టికల్‌గా రష్మిక సమాధానం ఇచ్చారు.

”వచ్చి నన్ను డైరెక్ట్‌గా కలువు. అప్పుడు నీతో నేను మాట్లాడి, పూర్తి ప్రాసెస్ చెప్తాను” అని రష్మిక అన్నారు. అంతేకాదు నన్ను ఎలా కలవాలో నా టీమ్‌ని అడుగు అంటూ వివరించింది. కాగా కన్నడలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. అందులో నటించిన రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడింది. అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వలన వీరిద్దరి నిశ్చితార్ధం క్యాన్సిల్‌ అయ్యింది. ఆ తరువాత ఓ సందర్భంలో రక్షిత్‌కి రష్మిక సారీ చెప్పిన విషయం తెలిసిందే.

Read More:

ప్రారంభమైన ‘వకీల్ సాబ్’ షూటింగ్‌.. కానీ..!

14 నెలలు మనసు చంపుకొని టీడీపీలో పనిచేశా: వాసుపల్లి

Loading...
Unable to load recommendations.
Follow Us