Alekhya Chitti Pikles: అవును.. ఆ బూతులు మా అక్కే తిట్టింది.. అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై రమ్య రియాక్షన్..

అలేఖ్య చిట్టి పికిల్స్.. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ పచ్చళ్లకు ఫేమస్. తక్కువ సమయంలోనే ముగ్గురు అమ్మాయి ఈ పచ్చళ్ల వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. కానీ నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడి ఒక్కసారిగా విమర్శల పాలయ్యారు. నెట్టింట వీరిపై జరుగుతున్న ట్రోలింగ్ దెబ్బకు పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ చేయాల్సిన స్థితికి వచ్చేశారు.

Alekhya Chitti Pikles: అవును.. ఆ బూతులు మా అక్కే తిట్టింది.. అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రావర్సీపై రమ్య రియాక్షన్..
Alekhya Chitti Pickles Audi

Updated on: Apr 05, 2025 | 2:15 PM

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు అలేఖ్య చిట్టి పికిల్స్. నాన్ వెజ్ పచ్చళ్లతో ఫేమస్ అయిన ముగ్గురు అక్క చెల్లెళ్ల వ్యాపారమే ఇది. తక్కువ సమయంలోనే పచ్చళ్ల వ్యాపారంలో వీరు ముగ్గురు సక్సెస్ అయ్యారు. వీరి పచ్చళ్లకు మంచి పేరు వచ్చింది. నెట్టింట వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని రోజులుగా విజయవంతంగా సాగుతున్న ఈ పచ్చళ్ల వ్యాపారంలో వారు మాట్లాడిన బూతు మాటలే కొంపముంచాయి. ఇటీవల ఓ కస్టమర్ పచ్చళ్లు కొందామని మెసేజ్ పెట్టడంతో వీరి వ్యాపారం ఊహించని మలుపు తిరిగింది. దీంతో వీరిపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఓ కస్టమర్ పచ్చళ్ల కోసం మెసేజ్ చేయడం.. ఆ పచ్చళ్ల రేట్స్ ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. దీంతో అలేఖ్య సిస్టర్స్ బూతు పురాణం స్టార్ట్ చేశారు. ఎవరు తిట్టారనే విషయంపై క్లారిటీ లేదు.. కానీ రాయడానికి.. వినడానికి వీలు లేని బూతులతో అతడిని తిడుతూ వాయిస్ మెసేజ్ పెట్టారు. దీంతో ఆ ఆడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సదరు కస్టమర్. దీంతో ఈ ముగ్గురు అక్కచెల్లేళ్ల తీరుపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు.నెట్టింట వీరి వ్యాపారంపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ రావడంతో దెబ్బకు అలేఖ్య చిట్టి పికిల్స్ వెబ్ సైట్ క్లోజ్ చేశారు. వాట్సప్ సైతం డీయాక్టివేట్ చేశారు. ఇక తాజాగా ఈ ఆడియో మెసేజ్ పై ముగ్గురు అక్కచెల్లెళ్లలో ఒకరైన సుమ కంచర్ల ఈ వివాదం రియాక్ట్ అవుతూ ఓ వీడియో చేసింది. తనను ట్రోల్ చేయవద్దని రిక్వెస్ట్ చేసింది.

ఇక తాజాగా ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరైన రమ్య కంచర్ల సైతం ఈ వివాదం పై ఓ వీడియో విడుదల చేసింది. ఒకరికి మెసేజ్ పెట్టబోయి ఇంకొకరికి పెట్టినట్లు రమ్య చెప్పుకొచ్చింది. అందులో వినిపించిన ఆ వాయిస్ తన అక్క అలేఖ్యదే అని అంగీకరించింది. తమకు రోజుకు వేల సంఖ్యలో ఆర్డర్స్ వస్తాయని.. అందులో కొందరు తమను బూతులు తిడతారని.. అలాంటి వ్యక్తులను బ్లాక్ చేస్తామని.. కొన్నిసార్లు ఆ విధమైన రిప్లై ఇస్తామని చెప్పుకొచ్చింది రమ్య మోక్ష. వైరల్ అయిన ఆడియో క్లిప్ విని విమర్శించే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. వేరే వ్యక్తికి పంపాల్సిన రిప్లై అనుకోకుండా మరో వ్యక్తికి వచ్చిందని.. ఆ వెంటనే అతడికి క్షమాపణలు చెప్పినట్లు వివరించింది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..