‘మర్డర్’ ట్రైలర్‌ విడుదల.. వర్మ సంధించిన ప్రశ్నలేంటంటే

కరోనా వైరస్‌ సమయంలోనూ వరుస సినిమాలను తెరకెక్కించడంతో పాటు వాటిని విడుదల చేస్తూ దూసుకుపోతున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

మర్డర్ ట్రైలర్‌ విడుదల.. వర్మ సంధించిన ప్రశ్నలేంటంటే

Updated on: Jul 28, 2020 | 10:44 AM

కరోనా వైరస్‌ సమయంలోనూ వరుస సినిమాలను తెరకెక్కించడంతో పాటు వాటిని విడుదల చేస్తూ దూసుకుపోతున్నారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఆయన తెరకెక్కించిన ‘మర్డర్’ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది.  తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓ పరువు హత్య ఘ‌ట‌న ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలను ట్రైలర్‌లో ఆయన సంధించారు.

పిల్లలను ప్రేమించడం తప్పా..? తప్పు చేస్తే దండించడం తప్పా..? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా..? పిల్లల్ని కనగలం కానీ వాళ్ల మనస్తత్వాలను కనగలమా..? అన్న ప్రశ్నలను ట్రైలర్‌లో చూపించారు. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను పెంచేశారు వర్మ.  ఇక ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా.. కుటుంబ కథా చిత్రమ్‌ అని ట్యాగ్‌లైన్ పెట్టడం విశేషం. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమాపై ఇప్పటికే వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: ప్రజలు దేవుడితో పాటు జగన్‌ ఫొటోను కూడా పెట్టుకుంటారు

Loading...
Unable to load recommendations.
Follow Us