చెర్రీకి చిరు సలహా.. ఓకే చెప్పిన మెగా పవర్‌స్టార్‌

తన తోటి హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ మాత్రం నిదానమే ప్రధానం అంటూ వస్తున్నారు

చెర్రీకి చిరు సలహా.. ఓకే చెప్పిన మెగా పవర్‌స్టార్‌
Follow us

| Edited By:

Updated on: Aug 25, 2020 | 5:30 PM

Ram Charan decision: తన తోటి హీరోలు వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ మాత్రం నిదానమే ప్రధానం అంటూ వస్తున్నారు. అందులోనూ హీరోగానే కాకుండా నిర్మాత బాధ్యతలు కూడా ఉండటంతో అంత స్పీడుగా చెర్రీ మూవీలు చేయలేకపోతున్నారు. దీనిపై ఫ్యాన్స్ కూడా బాగా ఫీల్ అవుతున్నారు. దాంతో చిరంజీవి కూడా కాస్త ఆలోచనలో పడ్డారట. ఈ నేపథ్యంలో హీరోగా సినిమాలపై దృష్టి పెట్టాలని చిరంజీవి, చెర్రీకి సూచించారట.

ధృవ, రంగస్థలంతో మంచి క్రేజ్‌ను తెచ్చుకున్న చెర్రీ.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది కాబట్టి.. చెర్రీ క్రేజ్ మరింత పెరగనుంది. ఇలాంటి నేపథ్యంలో ఇటు నిర్మాతగా, అటు హీరోగా రెండు పడవల మీద ప్రయాణం వద్దని చిరు చెప్పారట. హీరోగానే బిజీ అవ్వాలని తనయుడికి మెగాస్టార్ సూచించారట. దీంతో చెర్రీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇకపై హీరోగా బిజీ అవ్వబోతున్నట్లు సమాచారం.

అయితే చిరంజీవి రీఎంట్రీ కోసం నిర్మాతలా మారారు చెర్రీ. కొణిదెల ప్రొడక్షన్స్‌ని నిర్మించి.. అందులో ఇప్పటికే ఖైదీ నంబర్‌ 150, సైరా చిత్రాలను తెరకెక్కించారు. ఇక ప్రస్తుతం చిరు హీరోగా తెరకెక్కుతోన్న ఆచార్యను సైతం మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చెర్రీ నిర్మిస్తున్నారు. దీంతో పాటు లూసిఫర్ రీమేక్‌ని కూడా ఈయనే నిర్మించబోతున్నారు. మరోవైపు చిరుతో సినిమాలు తీసేందుకు బయట నిర్మాతలు కూడా క్యూలో ఉన్నారు(అన్ని సినిమాలు చెర్రీనే నిర్మిస్తుండటంతో కొంతమంది నిర్మాతలు చిన్నబుచ్చుకున్నారన్న టాక్ కూడా అప్పట్లో నడిచింది). ఇలాంటి సమయంలో బయటి నిర్మాతలకు అవకాశం ఇచ్చేందుకు, అలాగే హీరోగా చెర్రీకి బిజీ అయ్యేందుకు చిరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ చెర్రీ హీరోగా బిజీ అయితే ఫ్యాన్స్‌కి మాత్రం అది నిజంగా శుభవార్తనే.

Read More:

నయన్‌తో పెళ్లిపై స్పష్టతను ఇచ్చిన విఘ్నేష్

ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్‌పై దర్శకుడు క్లారిటీ

Latest Articles
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి