Devara: దేవర పై హైప్ పెంచేస్తోన్న అప్డేట్స్.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..

జనతా గ్యారేజ్ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Devara: దేవర పై హైప్ పెంచేస్తోన్న అప్డేట్స్.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
Devara
Follow us

|

Updated on: May 05, 2024 | 10:43 AM

యంగ్ రెబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటేస్ట్ చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత చాలాకాలంపాటు బ్రేక్ తీసుకున్న తారక్.. ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎంతో కసిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో తారక్ ఫుల్ మాస్ రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. జనతా గ్యారేజ్ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా అడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడిప్పుడే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ నెలలో తారక్ బర్త్ డే ఉందన్న సంగతి తెలిసిందే. ఆరోజున ఎన్టీఆర్ ప్రాజెక్ట్స్ నుంచి ఊహించని అప్డేట్స్ రానున్నట్లు సమాచారం. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా దేవర టీం సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే దేవర ఫస్ట్ సింగిల్ మే 20న రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో నెట్టింట దేవర ఫస్ట్ సింగిల్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది

ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమాలో నటించిన తారక్.. ఆ తర్వాత చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటించారు. ఇక దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ సోలోగా వస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.