Trisha: ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిషకు ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. మే 4న త్రిష పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఫోటోస్ షేర్ చేశారు ఫ్యాన్స్. 40 ఏళ్లు దాటిన తరగని అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తన నటనతో ప్రేక్షకులను మైమరపిస్తుంది త్రిష. 16 ఏళ్ల వయసులోనే లేసా లేసా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష.

Trisha: ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Varsham Movie
Follow us

|

Updated on: May 05, 2024 | 10:22 AM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో త్రిష ఒకరు. దాదాపు 24 ఏళ్లుగా సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా దూసుకుపోతుంది. నాలుగు పదుల వయసులోనూ చూపు తిప్పుకోనివ్వని గ్లామర్ లుక్స్‏తో యంగ్ హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిషకు ఇప్పుడు తెలుగు, తమిళం, మలయాళంలో వరుస అవకాశాలు వస్తున్నాయి. మే 4న త్రిష పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడికి బర్త్ డే విషెస్ తెలుపుతూ ఫోటోస్ షేర్ చేశారు ఫ్యాన్స్. 40 ఏళ్లు దాటిన తరగని అందంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తన నటనతో ప్రేక్షకులను మైమరపిస్తుంది త్రిష. 16 ఏళ్ల వయసులోనే లేసా లేసా సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది త్రిష. ఆ తర్వాత జోడి చిత్రంలో సిమ్రాన్ స్నేహితురాలిగా కనిపించింది.

2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రిషకు మంచి ఫేమ్ వచ్చింది. ఇందులో త్రిష యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే టైటిల్ కు తగ్గట్టు ఈ సినిమాలో చాలానే వర్షం సీన్స్ ఉంటాయి.

ముఖ్యంగా కథానాయికకు వర్షం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ వర్షంలో తడుస్తూ కనిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం దాదాపు 20 రోజులపాటు వర్షంలో తడిసిందట త్రిష. వర్షం సీన్స్ తీయడానికి దాదాపు 20 రోజులు తీసుకున్నారట. అన్ని రోజులు వర్షంలో తడవడంతో తీవ్రంగా జ్వరం, జలుబు వచ్చి హీరోయిన్ కండిషన్ సీరియస్ అయ్యిందట. ఆ దెబ్బకు ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకుందట. ఈ మూవీ రిజల్ట్ కోసం త్రిష ఎక్కువగానే టెన్షన్ పడిందట. కానీ మూవీ సూపర్ హిట్ కావడంతో త్రిష చాలా సంతోషించింది.

అయితే ఇదే సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ కూడా త్రిషను కథానాయికగా సెలక్ట్ చేయగా.. వర్షం వల్ల తాను ఇబ్బందిపడ్డానని.. అందుకే నో అని చెప్పిందట. వర్షం సినిమా కోసం త్రిష తీసుకున్న రిస్క్.. ఇప్పుడు ఆమెను తెలుగులో టాప్ హీరోయిన్ గా నిలబెట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.