ఈ నెల 27న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన 35వ పుట్టినరోజును జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపేందుకు అభిమానులు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ కరోనా విజృంభన రోజు రోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలను విరమించుకోవాలని ఆయన అభిమానులకు సూచించారు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాసిన చెర్రీ పలు సూచనలు కూడా చేశారు.
మీకు నా మీద ఉన్న ప్రేమ మరియు నా పుట్టిన రోజును పండుగగా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కాదు. ఇలాంటి సందర్భాల్లో మనం సాధ్యమైనంత వరకు జనసాంద్రత తక్కువగా ఉండేట్టు చూస్కుంటూ ఉండటం మంచిది. ఇది మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం నా పుట్టినరోజు వేడుకులను విరమించుకోవాల్సిందిగా నా మనవి.
మీరంతా మన అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేసి మీ వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చితే అదే నాకు ఈ సంవత్సరం మీరు ఇచ్చే అతి పెద్ద పుట్టినరోజు కానుక. నా మనవిని మీరంతా సహృదయంతో స్వీకరించి పాటిస్తారు అని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా కరోనా నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తూ టాలీవుడ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
Read This Story Also: తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు..!