రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకే కాదు.. సౌత్‌లోని సిని ప్రియులందరికీ పండుగే. అందులోనూ మురుగదాస్ లాంటి డైరెక్టర్, నయనతారా లాంటి హీరోయిన్ కాంబినేషన్ అంటే అంచనాలు మరింత భారీగా ఉంటాయి. పైగా పాతికేళ్ల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడంటే ఇక మామూలుగా ఉంటుందా..! అందుకే దర్భార్ మూవీ పై చెప్పలేనంత ఆసక్తి నెలకొంది. దానికి తోడు వరుసగా లీకవుతున్న షూటింగ్ స్పాట్ ఫోటోలు చూసి మరిన్ని అంచనాలు వేసేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈచిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ దర్భార్ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా చిత్రంలో రజనీకాంత్ లుక్స్‌కి సంబంధించి రెండు పోస్టర్స్‌ని మురుగదాస్ విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ లుక్స్ ప్రేక్షకులకి పట్టలేని ఆనందాన్ని అందిస్తున్నాయి. ఖాకీ డ్రస్సు పై లాంగ్ కోటు వేసుకుని.. చేతిలో ఆయుధంతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు రజనీకాంత్. ఇక అతి త్వరలోనే మూవీ టీజర్ రిలీజ్‌కి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. చిత్రంలో యువరాజ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ , విజయ్ సేతుపతి ధర్మదొరైలో నటించిన జీవా అనే ట్రాన్స్‌జెండర్ దర్భార్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారట. ఈ దెబ్బతో దర్భార్‌కి మరింత హైప్ క్రియేట్ అయిపోవడం ఖాయం అన్నట్లు తెలుస్తోంది.
Here you go guys, get creative and rock it. Follow the link to download the HD file https://t.co/iOyGXEpw3V @rajinikanth @LycaProductions @santoshsivan @anirudhofficial pic.twitter.com/EDz5QlA373
— A.R.Murugadoss (@ARMurugadoss) July 25, 2019