‘దర్బార్‌’గా రాబోతున్న సూపర్‌స్టార్

| Edited By:

Apr 09, 2019 | 10:21 AM

‘పేట’తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రంగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. బుధవారం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘దర్బార్‌’గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రజనీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. వాటిని తెలిపేలా వచ్చిన ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ మూవీ మొదటి షెడ్యూల్ ముంబయిలో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ భారీ […]

‘దర్బార్‌’గా రాబోతున్న సూపర్‌స్టార్
Follow us on

‘పేట’తో ఈ సంవత్సరం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రంగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. బుధవారం నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘దర్బార్‌’గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో రజనీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. వాటిని తెలిపేలా వచ్చిన ఫస్ట్‌లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇక ఈ మూవీ మొదటి షెడ్యూల్ ముంబయిలో ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ భారీ సెట్‌ను వేశారు. ఇక ఇందులో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. అలాగే రజనీకాంత్ కుమార్తెగా నివేథా థామస్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.