Puri Jagannadh : మరోసారి రిపీట్ కానున్న’సూపర్’ కాంబినేషన్.. నాగార్జునతో పూరీ సినిమా .?

డైనమిక్ డైరెక్టర్ పూరీజగన్నాద్ ప్రస్తుతం విజయ్ దేవర కొండ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాషూటింగ్ శరవేగంగా జరుగుతుంది..

Puri Jagannadh : మరోసారి రిపీట్ కానున్నసూపర్ కాంబినేషన్.. నాగార్జునతో పూరీ సినిమా .?

Updated on: Jan 17, 2021 | 4:54 PM

Puri Jagannadh : డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవర కొండ హీరోగా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాషూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా తర్వాత పూరి ఎవరితో సినిమా చేస్తాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో పూరి ప్రయత్నిస్తున్నాడు. అలాగే చిరంజీవితో కూడా సినిమా చేయాలని చూస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా పూరీ జగన్నాథ్ కింగ్ నాగార్జునతో సినిమా చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

పూరీ జగన్నాథ్ -నాగార్జున కాంబినేషన్ లో గతంలో సూపర్, శివమణి సినిమాలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ కానుందన్న వార్తలు వేడెక్కిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ టైంలో పూరీ జగన్నాథ్ నాగార్జున కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ రాసుకున్నారట. ఫాంటసీ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఈ సినిమా సాగుతుందని టాలీవుడ్ లో ప్రచారం నడుస్తోంది. మరి విజయ్ సినిమా తర్వాత పూరి ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసాడేమో చూడాలి. ఇక ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో అనన్యపండే హీరోయిన్ గా నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పూరీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ravi Teja Krack Movie : సాలిడ్ హిట్ కొట్టిన మాస్ రాజా.. ‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే..

Allu Arjun’s ‘Pushpa’: నో పార్టీస్.. నో ఫెస్టివల్స్.. మారేడుమిల్లిలో తెగ కష్టపడుతోన్న బన్నీ

Follow Us