Puneeth Rajkumar: నా సోదరుడి మరణం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది.. పునీత్‌ రాఘవేంద్ర భావోద్వేగం..

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈ లోకాన్ని విడిచిపోయి నెల రోజులు గడిచిపోయాయి. అయినా ఆయన చనిపోయాడన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Puneeth Rajkumar: నా సోదరుడి మరణం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది.. పునీత్‌ రాఘవేంద్ర భావోద్వేగం..

Edited By:

Updated on: Nov 30, 2021 | 5:13 PM

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఈ లోకాన్ని విడిచిపోయి నెల రోజులు గడిచిపోయాయి. అయినా ఆయన చనిపోయాడన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా అప్పు మరణించి నెల రోజులు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు సోమవారం కంఠీరవ స్డూడియోలో పునీత్‌ సమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న శివరాజ్‌కుమార్‌, సతీమణి గీతా, మరో సోదరుడు రాఘవేంద్ర, పునీత్‌ సతీమణి భార్య అశ్వినీ తదితరులు ఈ పూజల్లో పాల్గొని పునీత్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సోదరుడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

‘పునీత్‌కు కార్లు, కోట్ల రూపాయల డబ్బులున్నాయి. అయితే ఆయన చివరి రోజు కనీసం ఐదు నిమిషాల సమయం కూడా దొరకలేదు. అతను ఇంత త్వరగా ఈ లోకాన్ని ఎందుకు విడిచిపెట్టాడో మా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది’ అని పునీత్‌ చివరి క్షణాలను గుర్తు చేసుకున్నాడు రాఘవేంద్ర. కాగా అంతకుముందు ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివరాజ్‌కుమార్‌ కూడా ఇలాగే ఎమోషనల్‌ అయ్యారు. ‘చాలామంది లాగే తమ్ముడి మరణాన్ని ఇప్పటికీ నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. అప్పూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. ‘శివన్న’ అని ప్రేమగా పిలుస్తున్నట్టు వినిపిస్తోంది. ఈ నెల రోజులు ఎలా గడిచిపోయాయో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ విషాదం నుంచి బయట పడడానికి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. కానీ ఎక్కడికి వెళ్లినా పూల దండలతో కూడిన పునీత్‌ ఫొటోలే కనిపిస్తున్నాయి. వాటిని చూసిన ప్రతిసారీ నాకు కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అందుకే ఆ ఫొటోలను చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Also read:

Malavika Mohanan: షూటింగ్‌లో గాయపడిన మాస్టర్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్..

Pushpa: పుష్పరాజ్‌కు బాహుబలి సపోర్ట్‌.. పుష్ప ప్రి రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా డార్లింగ్‌.?

Spider Man No Way Home: యూఎస్‌ కంటే ముందుగా భారత్‌లోనే ల్యాండ్ కానున్న స్పైడర్‌ మ్యాన్‌.. విడుదల ఎప్పుడంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us