Priyanka Chopra: సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై నెటిజన్లు మండిపడుతున్నారు. విషయం ఏంటంటే.. ప్రస్తుతం లండన్‌లో కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తోంది. అయితే గతవారం ప్రియాంక తన తల్లి మధు చోప్రాతో కలిసి సెలబ్రెటీ స్టైల్ జోస్ వుడ్‌కు సంబంధించిన సెలూన్‌కు వెళ్ళింది. వారిని గమనించిన పోలీసులు ప్రియాంకతోపాటు, సెలూన్ నిర్వహకులను కూడా హెచ్చరించారు. ఇక ఈ విషయం వైరల్ కావడంతో నెటిజన్లు ప్రియాంక తీరుపై మండిపడ్డారు. దీంతో ఆ వివాదంపై ప్రియాంక చోప్రా సిబ్బంది స్పందించింది.
లండన్ ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిందని… అందుకోసమే ప్రియాంక అన్ని నిబంధనలు పాటిస్తూ.. సెలూన్‌కు వెళ్ళిందని తెలిపారు. అంతేకాకుండా షూటింగ్లో పాల్గొనే ముందు అక్కడి వారందరు కొవిడ్ పరీక్షలు చేయించుకున్నారని.. ఎవరికి పాజిటివ్ రాలేదని.. దాంతో షూటింగ్ మొదలు పెట్టారని తెలిపారు. ప్రస్తుతం ప్రియాంక టెక్ట్ ఫర్ యూ అనే సినిమాలో నటిస్తుంది. ఆ మూవీ షూటింగ్ కోసం ఇటీవల లండన్‌కు వెళ్ళింది. ఇక కొన్ని రోజుల పాటు క్యారంటైన్లో ఉన్న తర్వాత ప్రియాంక చిత్రీకరణంలో పాల్గొంది.
Also Read: కోపంతో భర్తను కారు నుంచి దింపేసిన ప్రియాంక చోప్రా.. వీధుల్లో గొడవపడిన జంట.. అసలు కారణం ఏంటీ?..
‘ది వైట్ టైగర్’ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్ విడుదల.. ఇందులో కొన్ని సన్నివేశాలను చూస్తే..