Priyanka Chopra: ప్రియాంక దంపతుల ఫ్యామిలీ ప్లానింగ్ మాములుగా లేదుగా.. పుట్టబోయే పిల్లల కోసం వీరేం చేశారో తెలుసా?

|

Jan 27, 2022 | 12:47 PM

గ్లోబ‌ల్ స్టార్ క‌పుల్‌  ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) - నిక్ జోన‌స్ (Nick Jonas) ఇటీవ‌లే స‌రోగ‌సి ద్వారా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల నుంచి ఈ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Priyanka Chopra: ప్రియాంక దంపతుల ఫ్యామిలీ ప్లానింగ్ మాములుగా లేదుగా.. పుట్టబోయే పిల్లల కోసం వీరేం చేశారో తెలుసా?
Priyanka Chopra
Follow us on

గ్లోబ‌ల్ స్టార్ క‌పుల్‌  ప్రియాంకా చోప్రా(Priyanka Chopra) – నిక్ జోన‌స్ (Nick Jonas) ఇటీవ‌లే స‌రోగ‌సి ద్వారా పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖుల నుంచి ఈ జంటకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రియాంక సోదరి, ‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రా (Meera Chopra) ప్రియాంక దంపతులకు అభినందనలు తెలిపింది.  జూనియర్ ప్రియాంకా వచ్చేసిందంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ పెట్టింది. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన ఓ వీక్లీ మ్యాగజైన్ పీసీ దంపతులకు సంబంధించిన ఆ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.  కాగా నిక్యాంక (అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు) 2018లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.  ఆ మ‌రుస‌టి ఏడాది అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే 20 మిలియన్ల డాలర్లు ( ఇండియన్ కరెన్సీలో రూ .149 కోట్లు)  వెచ్చించి ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు.

మూడు నెలల పాటు శ్రమించి..

అంతేకాదు దంపతులిద్దరూ మూడు నెలల పాటు శ్రమించి తమకు నచ్చినట్లు ఇంటిని రినోవేషన్ కూడా చేయించుకున్నారట. అయితే ఇంత ఖర్చు పెట్టి, శ్రమ పడి ఇల్లును కొనుగోలు చేయడం వెనక ఓ బలమైన కారణం ఉందట. అదేంటంటే..  భవిష్యత్ లో  త‌మ పిల్ల‌ల‌తో గ‌డిపే ప్ర‌తి క్ష‌ణాన్ని మ‌ధుర జ్ఞాప‌కంగా మిగుల్చుకోవాలన్నది ఈ దంపతుల కల అట. అందుకే  పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకుని వారికోసం అక్క‌డ‌ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేశారట. ఇంటి అవుట్ డోర్ స్పేస్, చుట్టూ పచ్చదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. తాజాగా మరో బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ ప్రియాంక దంపతులకు అభినందనలు తెలిపింది. ‘నిద్రలేని రాత్రులు గడిపేందుకు సిద్ధంగా ఉండు.. అమ్మ తనాన్ని ఆస్వాదించు’ అని తనదైన శైలిలో విషెస్ చెప్పింది.

Also read: Tom Aditya: యూకే రాజకీయాల్లో ప్రవాస భారతీయుల సత్తా.. బ్రిస్టల్ బ్రాడ్లీ స్టోక్ మేయర్ గా ఎన్నారై వ్యక్తి..

Coronavirus: దేశంలో కొనసాగుతోన్న కరోనా ఉద్ధృతి.. పెరిగిన యాక్టివ్ కేసులు.. నిన్న ఎంత మంది వైరస్ బారిన పడ్డారంటే..

Hyderabad: నేడు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలివే..