ఇండియన్ మైకెల్ జాక్సెన్ ప్రభుదేవా ఎంతటి క్రేజీ కొడియో గ్రాఫరో అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ఆయన డాన్స్‌ర్‌గానే కాకుండా హీరోగా, దర్శకుడిగా పలు రకాల పాత్రలను పోశించాడు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సంజయ్‌దత్, చిరంజీవి లాంటి అగ్రహీరోల సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ప్రభుదేవా తనలోని నటుడిని కొత్తకోణంలో ప్రజెంట్ చేయాలని భావించాడు. అందుకోసం అద్విక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్నబఘీరా అనే చిత్రంలో సీరియల్ కిల్లర్ పాత్ర పోషిస్తున్నాడు. మొదటిసారిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు రవిచంద్రన్ మొదటిసారిగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఐదుగురు భామలు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జంగిల్ బుక్‌లోని బఘీరా క్యారెక్టర్ స్ఫూర్తితో దర్శకుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే సంవత్సరం సినిమా రిలీజ్‌కు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.