మళ్లీ ప్రేమలో పడ్డ ఆమిర్ కుమార్తె, ఫిట్‌నెస్ ట్రైనర్‌తో ప్రయాణం షురూ, ప్రస్తుతం డేటింగ్‌లో !

మళ్లీ ప్రేమలో పడ్డ ఆమిర్ కుమార్తె,  ఫిట్‌నెస్ ట్రైనర్‌తో ప్రయాణం షురూ, ప్రస్తుతం డేటింగ్‌లో !

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్ఫెక్షనిస్ట్‌  ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ ప్రేమ పాఠాలు వల్లె వేస్తున్నట్లు బీ టౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. మిషాల్‌ అనే వ్యక్తితో కొంతకాలంపాటు పీకల్లోతు హద్దుల్లేని..

Ram Naramaneni

| Edited By: Rajesh Sharma

Nov 25, 2020 | 12:16 PM

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్ఫెక్షనిస్ట్‌  ఆమిర్‌ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ ప్రేమ పాఠాలు వల్లె వేస్తున్నట్లు బీ టౌన్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. మిషాల్‌ అనే వ్యక్తితో కొంతకాలంపాటు పీకల్లోతు హద్దుల్లేని ప్రేమలో తడిసి ముద్దయిన ఈ స్టార్ హీరో కుమార్తె.. చాలాసార్లు తమ మధ్య ఉన్న రిలేషన్‌ను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచింది. అయితే ఈ జంట మధ్య గతేడాది అభిప్రాయ బేధాలు వచ్చాయి. అవి అలానే కొనసాగాయి. దీంతో ఇరువురు ప్రేమ ప్రయాణానికి ఎండ్ కార్డు వేశారు. కాగా తాజాగా ఐరాఖాన్‌ తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ షీఖరేతో లవ్ జర్నీ షురూ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

కొన్నేళ్లుగా ఆమిర్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నుపూర్..‌ లాక్‌డౌన్‌ నుంచి ఐరాకు సైతం కసరత్తుల విషయంలో హెల్ప్ చెయ్యడం మొదలెట్టాడు. ఈ ప్రయాణం మొదట స్నేహానికి, ఆపై ప్రేమకు దారి తీసిందట.  నుపూర్‌ వ్యక్తిత్వం నచ్చడం వల్ల ఐరా అతనితో లవ్‌లో పడిందిని.. కొన్నినెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని చెబుతున్నారు.  ఐరా తన తాజా ప్రేమ విషయాన్ని తల్లి చెవిన వేసిందట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల ఆమిర్‌ఖాన్‌ ఫామ్‌హౌస్‌లో ప్రెండ్స్‌తో కలిసి ఓ రేంజ్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జోడికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరలువుతున్నాయి.

Also Read :

కరోనా కాటు : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి, విషాదంలో పార్టీ శ్రేణులు

పేదలకు నాణ్యమైన వైద్యం : ఏపీలో 560 వైఎస్సార్ పట్టణ క్లినిక్​ల ఏర్పాటుకు ఉత్తర్వులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu