
ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న చిత్రం ప్రాజెక్ట్ కే. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మాతగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిసత్ఉన్నాడు. మహానటి వంటి అద్భుత విజయం తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలకు అనుగుణంగానే నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెలుగు తెరపై మునుపెన్నడూ లేని కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంగా సూపర్ హీరో కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అసలు టైటిల్ ఏంటన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్‌లా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఖుషే చేస్తోంది.
నెట్టింట ట్రెండ్ అవుతోన్న వార్త ప్రకారం ప్రాజెక్ట్ కే చిత్ర షూటింగ్‌కు త్వరగతిన పూర్తి చేసి 2024 వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ 2023 చివరినాటికల్లా సినిమా షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్‌లో మెజారిటీ విఎఫ్‌ఎక్స్ కోసం కేటాయిస్తోంది చిత్ర యూనిట్. ఇందులో భాగంగానే ఇందుకోసం ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..