పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ చిత్రీకరం చివరిదశకు చేరుకుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ప్రభాస్’రాధేశ్యామ్’ సినిమా తర్వాత ఓంరౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ ఫేం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించనున్న ఆదిపురుష్ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోయే ఆదిపురుష్ సినిమా షూటింగ్ జనవరి 19 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ముంబైలోని ఓ స్టూడియోలో ప్రారంభించనున్నారని.. అలాగే దాదాపు ఎక్కువ శాతం మూవీ అదే స్టూడియోలో చిత్రీకరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించనుండగా.. సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే సంవత్సరం ఆగస్ట్‌లో ‘ఆదిపురుష్’ విడుదల చేయనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.
Also Read: మరో వివాదంలో ప్రభాస్ ‘ఆదిపురుష్’.. సినిమా డైరక్టర్, విలన్‌పై పిటిషన్.. అసలు విషయం ఇదే..
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. నాగ్ అశ్విన్ సినిమా ఆలస్యం అవ్వక తప్పదా…