
టాలీవుడ్ బుట్ట బొమ్మ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవుతోంది. అయితే ఈ బ్యూటీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ బ్యూటీ మరోసారి నాగచైతన్యతో జోడీ కట్టబోతున్నట్టు టాక్. నాగచైతన్య ‘విరూపాక్ష’ దర్శకుడితో చేయబోయే సినిమాలో గ్లామర్ భామ పూజా హెగ్డే రొమాన్స్ చేయబోతోంది. పూజా హెగ్డే హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం పూజా వెయిట్ చేస్తోందని, ఈ సినిమా ఆమెకు పెద్ద కమ్ బ్యాక్ గా అవుతుందంటున్నారు ఫ్యాన్స్. అయితే టాలీవుడ్ లో ఆమెకు ఉన్న పాపులారిటీ నేటికి క్రేజ్ చెక్కుచెదరలేదని ప్రూవ్ అవుతోంది.
తెలుగు చిత్రం ‘ఒక లైలా కోసం’ (2014)లో ప్రేమికులుగా నటించిన నాగచైతన్య, పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి ప్రశంసలు లభించాయి. అయితే పౌరాణిక థ్రిల్లర్ అంశాలతో విలక్షణమైన కథతో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం నాగచైతన్య, పూజల కలయిక ఈ భారీ బడ్జెట్ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ‘విరూపాక్ష’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బోగవల్లి ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నమూవీపై పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం నటీనటుల ఎంపిక కొనసాగుతోంది.
సినిమాల ఎంపికలో వేగం తగ్గించిన ఈబ్యూటీ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో మిర్రర్ సెల్ఫీ ఫొటోలను షేర్ చేసింది. చిరునవ్వుతో అందాలను ఆరబోస్తున్న ఫోటోను షేర్ చేసింది పూజా. ఎత్తైన పోనీటెయిల్ తో వైట్ టాప్ తో మెరిసిపోయింది ఈ బ్యూటీ. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షాహిద్ కపూర్ నటిస్తున్న ఓ సినిమా తో బిజీగా ఉంది పూజ.