‘పీఎమ్ నరేంద్ర మోదీ’ వారం రోజుల ముందే విడుదల

| Edited By:

Mar 19, 2019 | 11:48 AM

పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ ముందుగా ప్రకటించిన తేదీ కన్న వారం రోజుల ముందుగానే విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నుంచి చాలా బయోపిక్ లు తెరపైకి వస్తున్నా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ పైనే అందరి దృష్టి వుంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో .. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారిగా ‘పీఎమ్ నరేంద్రమోదీ’ నిర్మితమైంది. సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ .. ఆనంద్ పండిట్ .. ఆచార్య మనీశ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. […]

పీఎమ్ నరేంద్ర మోదీ వారం రోజుల ముందే విడుదల
Follow us on

పీఎం నరేంద్ర మోదీ బయోపిక్ ముందుగా ప్రకటించిన తేదీ కన్న వారం రోజుల ముందుగానే విడుదల చేయనున్నారు. బాలీవుడ్ నుంచి చాలా బయోపిక్ లు తెరపైకి వస్తున్నా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ పైనే అందరి దృష్టి వుంది. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో .. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారిగా ‘పీఎమ్ నరేంద్రమోదీ’ నిర్మితమైంది. సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ .. ఆనంద్ పండిట్ .. ఆచార్య మనీశ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఒక వారం ముందుగానే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అలా ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. నరేంద్ర మోదీ జీవితంలోని ఒడిదుడుకులు .. వాటిని అధిగమిస్తూ ఆయన తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వచ్చిన తీరును ఈ సినిమాలో చూపించనున్నారు. ఆదర్శవంతమైన ఆయన జీవితచరిత్రకి ఏ స్థాయి ఆదరణ లభిస్తుందో వేచిచూడాలి.