
చిత్ర పరిశ్రమలో ఏ భాషలోనైనా సరే.. తమకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీని, అన్నం పెట్టిన పరిశ్రమను గౌరవించడం ప్రతి నటీనటుడి బాధ్యత. కానీ ఈమధ్య కాలంలో కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. తమ కెరీర్ ప్రారంభంలో అవకాశాలు ఇచ్చి.. భారీ పారితోషికాలు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమపై ఇప్పుడు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో టాలీవుడ్ అడియన్స్ సదరు తారలపై మండిపడుతున్నారు. తాజాగా బాలీవుడ్ , సౌత్ నటి రాధికా ఆప్టే ఇటీవల అక్క సినిమా ప్రమోషన్లలో చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు సినిమా పరిశ్రమపై ఆమె చేసిన కామెంట్స్‌పై ఇప్పటికే నిర్మాత ఎస్కేఎన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వ్యవహారం పై ఆర్‌ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ తీవ్రంగా స్పందించారు. టాలీవుడ్‌కు అండగా నిలుస్తూ రాధికా ఆప్టేకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. రాధికా ఆప్టే ఇటీవల ఓ ఇంటర్వ్యూలలో సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో నటీమణుల పాత్రల గురించి చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటులకు, ముఖ్యంగా హీరోయిన్లకు సరైన ప్రాధాన్యత దక్కదని, కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారనే రీతిలో ఆమె మాట్లాడిన తీరుపై టాలీవుడ్ ప్రముఖులు , అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పాయల్ రాజ్‌పుత్ ఈ వివాదంపై స్పందించారు. తెలుగు ఇండస్ట్రీ తనకు ఎంతో పేరును, గుర్తింపును, భద్రతను ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కెరీర్ ఇచ్చిన పరిశ్రమపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. “తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నది. ఇక్కడ నటీనటులను ఎంతో గౌరవిస్తారు. మనకు మంచి జీవితాన్ని, భవిష్యత్తును ఇచ్చిన ఇండస్ట్రీ గురించి ఇష్టానుసారం మాట్లాడటం సరైన పద్ధతి కాదు” అంటూ పాయల్ రాజ్‌పుత్ రాధికా ఆప్టేకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తాను ఒక గర్వించదగ్గ తెలుగు నటిగా టాలీవుడ్‌లో కొనసాగుతున్నానని, ఇక్కడి ప్రేక్షకులు చూపించే ప్రేమను ఎప్పటికీ మరచిపోలేనని ఆమె స్పష్టం చేశారు. “నేను తెలుగు నటిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. మీకు పేరు ప్రఖ్యాతులు, స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్ర పరిశ్రమ గురించి చెడుగా మాట్లాడడం. సంవత్సరాల తర్వాత ఇలా నిందలు వేయడం ధైర్యం అనిపించుకోదు. మీ కెరీర్ కు పునాది వేసిన మొత్తం ఇండస్ట్రీపై ఇలా విమర్శలు చేయడం మీలోని అసహనానికి అక్కసుకే నిదర్శనం. ఈరోజు నేను ఈస్థాయిలో ఉన్నానంటే దానికి కారణం టాలీవుడ్. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన ఈ పరిశ్రమకు నేను ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉటాను.”అని రాసుకోచ్చింది. ” ఏ ఇండస్ట్రీ అయినా అక్కడి సంస్కృతిని, శ్రమను గౌరవించాలని పాయల్ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ అభిమానులు పాయల్ రాజ్‌పుత్ తీసుకున్న ఈ స్టాండ్‌ను ప్రశంసిస్తూ ఆమెకు పూర్తి మద్దతు తెలుపుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..