కరోనా టెస్ట్: చిన్న పిల్లలా ఏడ్చేసిన పాయల్‌.. వీడియో వైరల్

టాలీవుడ్‌లో మళ్లీ సందడి మొదలైంది. సినిమా షూటింగ్‌లు మొదలు కావడంతో ఒక్కొక్కరు సెట్స్ మీదకు వెళుతున్నారు.

కరోనా టెస్ట్: చిన్న పిల్లలా ఏడ్చేసిన పాయల్‌.. వీడియో వైరల్

Updated on: Sep 26, 2020 | 5:24 PM

Payal Rajput Covid 19 test: టాలీవుడ్‌లో మళ్లీ సందడి మొదలైంది. సినిమా షూటింగ్‌లు మొదలు కావడంతో ఒక్కొక్కరు సెట్స్ మీదకు వెళుతున్నారు. అయితే సెట్స్ మీదకు వెళ్లే ముందు, వెళ్లిన తరువాత చాలా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ముఖ్యంగా కరోనా టెస్ట్ చేసి చిత్రీకరణలను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ షూటింగ్‌లో పాల్గొన్న నటి పాయల్‌కి కరోనా పరీక్ష చేశారు. అయితే శాంపిల్స్ తీసుకునే సమయంలో పాయల్ చిన్న పిల్లలా ఏడ్చేసింది. దానికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

”అన్ని ముందస్తు జాగ్రత్తలతో మొత్తానికి తిరిగి సెట్స్ మీదకు వచ్చా. శాంపిల్స్ తీసుకునే సమయంలో చాలా భయమేసింది. ముక్కులో తిప్పుతూ శాంపిల్స్ తీసుకోవడం భయంగా, ఇబ్బందిగా అనిపించింది. మొత్తానికి ఇచ్చేశా. పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది” అంటూ వెల్లడించారు.

Read More:

ఆ రోజు ఎస్పీబీ సాయం చేయకపోయి ఉంటే..: ప్రపంచ మాజీ ఛాంపియన్‌

తన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చిన బాలు..!

Loading...
Unable to load recommendations.
Follow Us