‘ఆర్ఎక్స్ 100’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్…కుర్రకారుకు ఏసీ థియేటర్లలో కూడా చెమటలు పట్టించింది. హాట్ హాట్ అందాలతోనే కాదు నెగటీవ్ షేడ్స్ పాత్రతో మెప్పించి స్టార్ డమ్ అందుకుంది. క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
దీంతో పాయల్ ఇంటి ముందు నిర్మాతలు క్యూ కట్టారు. ఆమెకు ఈ సినిమా తెచ్చిన క్రేజ్‌తో మరో హీరోయిన్ అయితే వరుస పెట్టి సినిమాలు చేసేది. అయితే పాయల్ మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తోంది. ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలైతేనే సైన్ చేస్తోంది. ప్రస్తుతం రెండు విమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి ఓకే చెప్పిన పాయల్.. మరోవైపు తోటి కథానాయికలు తీసుకోలేని డేరింగ్ డెసిషన్ తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది