మా స్నేహం సినిమాల్లోకి రాకముందు నుంచి… వెంకటేష్ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నా…

వెంకటేష్ పుట్టిన రోజును సందర్భంగా పవన్ ప్రత్యేక ప్రకటన ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రకటనలో తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్‌తో తనకున్న అనుబంధం ప్రత్యేకమైందని పవన్ పేర్కొన్నారు.

మా స్నేహం సినిమాల్లోకి రాకముందు నుంచి... వెంకటేష్ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నా...

Edited By:

Updated on: Dec 13, 2020 | 9:23 PM

మా స్నేహం సినిమాల్లోకి రాకముందు నుంచి అని విక్టరీ వెంకటేష్ తో ఉన్న అనుబంధాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. వెంకటేష్ పుట్టిన రోజును సందర్భంగా పవన్ ప్రత్యేక ప్రకటన ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ ప్రకటనలో తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేష్‌తో తనకున్న అనుబంధం ప్రత్యేకమైందని పవన్ పేర్కొన్నారు.

నేను సినిమాల్లోకి రాకముందే ఆయనతో పరిచయం ఏర్పడిందని తెలిపారు. తమ మధ్య ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన విషయాలు చర్చకొచ్చేవని పేర్కొన్నారు. తమ మధ్య ఉన్న స్నేహమే గోపాల గోపాల సినిమాలో నటించేలా చేసిందని తెలిపారు. ఆ చిత్రం తమ ఆలోచనలకు అద్దం పడుతుందని తెలియజేశారు. కొత్త తరం, కొత్త దర్శకుల కథలకు, ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకునే వెంకటేష్ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పించాలని ఆకాంక్షిస్తున్నా అని పవన్ తెలిపారు.