Bheemla Nayak: ‘పవన్‌ నట విశ్వరూపం, కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌’.. భీమ్లా నాయక్‌ ట్విట్టర్‌ రివ్యూ చూశారా.?

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. వకీల్‌సాబ్‌ తర్వాత పవన్‌ నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పాలు సార్లు...

Bheemla Nayak: పవన్‌ నట విశ్వరూపం, కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌.. భీమ్లా నాయక్‌ ట్విట్టర్‌ రివ్యూ చూశారా.?
Bheemla Nayak Review

Updated on: Feb 25, 2022 | 7:19 AM

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమా ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. వకీల్‌సాబ్‌ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. నిజానికి ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా  (Corona) కారణంగా పాలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఫిబ్రవరి 25 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఇప్పటికే లండన్‌, అమెరికాతో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్‌ షోలు నడుస్తున్నాయి. దీంతో పవన్‌ అభిమానులు ట్విట్టర్‌లో హోరెత్తిస్తున్నారు. సినిమా ఎలా ఉందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో షేర్‌ చేస్తున్నారు. మరి భీమ్లా నాయక్‌పై ట్రెండ్‌ అవుతోన్న కొన్ని ట్వీట్స్‌పై ఓ లుక్కేయండి..

* పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే భీమ్లా నాయక్‌ సినిమా ఒక మాసివ్‌ సినిమా. థమన్‌ మ్యూజిక్‌కు పవన్‌ నట విశ్వరూపం తోడైంది. సెకండ్ హాఫ్‌ ఎవరూ కుర్చీల్లో కూర్చోలేరు. క్లైమాక్స్‌లో త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపిస్తుంది. రానా నటన అద్భుతంగా ఉంది. అంటూ అమెరికాకు చెందిన ఓ అభిమాని ట్వీట్ చేశాడు.

* భీమ్లా నాయక్‌ మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌.. ఫస్టాఫ్‌ కొంచెం నెమ్మదిగా సాగినట్లు అనిపించినా సెకండ్‌ మాత్రం మాములుగా లేదు. ఒళ్లు గగురు పొడిచే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. మాస్‌ ప్రేక్షకులకు ఇది ఒక కన్నుల పండుగ, జనరల్‌ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది అంటూ ఓ అభిమాని భీమ్లా నాయక్‌ చిత్రానికి 3.25 రేటింగ్‌ ఇచ్చాడు.

* గబ్బర్‌ సింగ్ రేంజ్‌ సినిమా ఇది. పవన్‌ కళ్యాణ్‌, రానాలు అద్భుతంగా నటించారు. థమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ వేరే లెవల్‌లో ఉంది. డైరెక్షన్‌, డైలాగ్స్‌ అరుపులు అంటూ యూకేకి చెందిన అభిమానులు ట్వీట్ చేశారు.

భీమ్లా నాయక్‌పై ట్రెండ్ అవుతోన్న మరికొన్ని ట్వీట్స్‌..

Also Read: Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

Loading...
Unable to load recommendations.
Follow Us