Vijay Antony: విజయ్ ఆంటోని ‘రత్తం’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..

|

Oct 31, 2023 | 10:13 PM

డైరెక్టర్ సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని నటన మరోసారి విమర్శకులను.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శుక్రవారం

Vijay Antony: విజయ్ ఆంటోని రత్తం స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..
Raththam Movie
Follow us on

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన లేటేస్ట్ సినిమా ‘రత్తం’. డైరెక్టర్ సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని నటన మరోసారి విమర్శకులను.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా శుక్రవారం అంటే నవంబర్ 3న నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమా తమిళంలోనే విడుదల అవుతుందా ?.. లేదా తెలుగులోనూ వస్తుందా ?. అన్న విషయంపై క్లారిటీ రాలేదు. ఈ సినిమాలోని నటీనటులు యాక్టింగ్, సంగీతం మెప్పించాయి.

కథ విషయానికి వస్తే..

ఇందులో రంజిత్ కుమార్ అనే పరిశోధనాత్మక జర్నలిస్ట్ పాత్రను విజయ్ ఆంటోనీ పోషించాడు. చెన్నైలో తీవ్ర సంచనంల సృష్టించిన వరుస హత్యల వెనుక ఉన్న నింధితుడిని కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ హత్యల కారణంగా రాజకీయ దుమారం చెలరేగి కొందరు మంత్రుల రాజీనామాకు దారితీసిన పరిణామాలను చూపించారు. చెజియాన్ అనే వ్యక్తి ఒక మీడియా సంస్థ సంపాదకుడు. అతను ఆరాధించే సినీ నటుడి గురించి ప్రతికూలంగా పోస్ట్ చేసినందుకు ఒక మతోన్మాదుడు హత్య చేయబడ్డాడు. జర్నలిస్ట్ హత్యను లోతుగా పరిశోధిస్తున్నప్పుడు ఆ హత్య వెనక మరింత నెట్‌వర్క్ ఉందని రంజిత్ గ్రహిస్తాడు. అంతేకాకుండా హత్యలను అరికట్టడానికి, అక్రమ రాకెట్‌ను అంతమొందించడానికి రంజిత్ కుమార్ చేసే ప్రయత్నం చుట్టూ కథాంశం తిరుగుతుంది.

ఈ సినిమాలో మహిమ నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబీశన్, నిజాల్‌గల్ రవి కీలకపాత్రలు పోషించారు.. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోహ్రా, జి ధనంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోహ్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కన్నన్ నారాయణన్ అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.