
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చారీ 111. మిస్టర్ బీన్ నటించిన హాలీవుడ్ సినిమా జానీ ఇంగ్లిష్ స్ఫూర్తి తో టీజీ కీర్తికుమార్ ఈ స్పై కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించారు. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటించింది. సత్య, తాగుబోతు రమేష్, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పోస్టర్స్ ,టీజర్స్, ట్రైలర్ ఆసక్తికరంగా అనిపించడంతో వెన్నెల కిశోర్ సినిమాపై హైప్ పెరిగింది. అయితే మార్చి1న థియేటర్లలో రిలీజైన చారి 111 అంచనాలను అందుకోలేకపోయింది. ఎప్పటిలాగే వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో కడు పుబ్బా నవ్వించినా, కథ, కథనాలు ఆసక్తికరంగా లేవని టాక్ వినిపించింది. దీంతో చారి 111 పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. థియేటర్లలో మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న చారి 111 అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 16 నుంచే చారి 111 సినిమా ఓటీటీలోకి రానుందని టాక్.
కాగా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మరో తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోనూ చారి 111 సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే చారి 111 సినిమాను మొదట డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారట. అయితే టీజర్స్, ట్రైలర్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో నిర్ణయం మార్చుకుని థియేటర్లలో రిలీజ్ చేశారట. అంతేకాదు చారి 111 మూవీకి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు సమాచారం. మరి మొదటి పార్ట్ కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. మరి సీక్వెల్స్ ను అనౌన్స్ చేస్తారా? ఒక వేళ తీసినా థియేటర్లలో రిలీజ్ చేస్తారా? లేదా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి