ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను, వెబ్ సిరీస్‌లోను తీసుకువస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అటు థియేటర్లలో బ్లాక్ బస్టర్ చిత్రాలు రన్ అవుతున్నా.. ఓటీటీలకు ఆదరణం మాత్రం తగ్గడం లేదు. ఇప్పటివరకు అనేక వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరించగా.. ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేసిన ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కించారు. తాజాగా ఆ సిరీస్ టీజర్ విడుదల చేశారు మేకర్స్. 1984లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన గ్యాస్ విపత్తు ఆధారంగా యశ్ రాజ్ ఫిలింస్ తెరకెక్కించిన తొలి వెబ్ సిరీస్ ‘ది రైల్వే మెన్’. ఇందులో ఆర్ మాధవన్, కెకె మీనన్, దివ్యేందు శర్మ, ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ విడుదల చేయగా.. ఈ సిరీస్‌లో మాధవన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ రతీ పాండే పాత్రలో కనిపించనున్నారు. కాగా కెకె మీనన్ స్టేషన్ మాస్టర్. దీంతో పాటు దివ్యేందు కానిస్టేబుల్‌గా, బాబిల్ లోకో పైలట్‌గా నటిస్తున్నారు. ప్రమాదం జరిగిన రోజు రాత్రి నలుగురూ ప్రాణాలను కాపాడే పనిలో ఉన్నారని టీజర్ చూస్తే తెలుస్తుంది.
దీపావళి సందర్భంగా ఈ 4-భాగాల సిరీస్ నవంబర్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి నూతన దర్శకుడు శివ్ రావైల్ దర్శకత్వం వహించగా, ఆయుష్ గుప్తా కథను అందించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సిరీస్‌ను 2021లో ప్రకటించగా.. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు.
One tragic night that stirred the entire nation and four heroes who fought through it all.
Here’s the teaser for #TheRailwayMen – a four episode series inspired by true stories. Arrives November 18, only on Netflix! pic.twitter.com/jReeGfQIJE— Netflix India (@NetflixIndia) October 28, 2023
దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు..
1984లో, డిసెంబర్ 2-3 రాత్రి, భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి విష వాయువు లీక్ అయింది. కర్మాగారంలోని ప్లాంట్ నెం. ‘సి’లో, టాక్సిక్ మిథైల్ ఐసోసైనైడ్ వాయువు ట్యాంక్ నంబర్ 610లో కలపడం ప్రారంభమైంది. రసాయన ప్రతిచర్య ఒత్తిడిలో ట్యాంక్ తెరుచుకుని విషపూరిత వాయువు గాలిలో కలిసిపోవడం ప్రారంభించింది. ఈ ప్రమాదంలో దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ అనేక కుటుంబాలు ఈ విష వాయువు ప్రభావాలను అనుభవిస్తున్నాయి.
https://t.co/8MJjpABLPT. @ActorMadhavan @kaykaymenon02 @divyenndu #BabilKhan @shivrawail @aayush03gupta @MogreYogendra @NetflixIndia @yrf #YRFEntertainment
— Ranganathan Madhavan (@ActorMadhavan) October 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.