
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. సమంత వంద కోట్ల సినిమా మా ఇంటి బంగారం, వడ్డే నవీన్ రీఎంట్రీ మూవీ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు సెకండ్ లవ్, రెడీ ఆర్ నాట్ 2 వంటి డబ్బింగ్ సినిమాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేయనున్నాయి. అయితే వీటి సంగతి పక్కన పెడితే.. కొన్ని రోజుల క్రితం ఓటీటీలోకి వచ్చిన ఓ మూవీ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఆసక్తికర కథ, కథనాలతో తెరకెక్కిన ఈ మూవీకి ఓటీటీలో భారీ వ్యూస్ వస్తున్నాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలోనూ మంచి రేటింగ్ ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనాథ అయిన హీరో ఒక రాజకీయ నాయకుడి కూతురుతో ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు తండ్రి డబ్బు, పదవి కోసం ఓ ముసలి రాజకీయ నాయకుడికి ఇచ్చి రెండవ పెళ్లి చేయాలని ప్రణాళికలు రచిస్తాడు. దీంతో ఆ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి వచ్చి హీరోను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. తీవ్రమైన ఆర్థిక సమస్యలకు తోడు అమ్మాయి తండ్రి పంపిన రౌడీ మూకలు ఈ కొత్త జంటకు నిద్ర లేకుండా చేస్తాయి. దీంతో వీరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక రిసార్ట్ లో తల దాచుకుంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ రిసార్ట్‌లో ఒక వ్యక్తి డార్క్ వెబ్ కోసం, తమ రిసార్ట్ లో దిగే కపుల్ ప్రైవేట్ వీడియోలను దొంగతనంగా రికార్డ్ చేస్తూ ఉంటాడు. చివరకు ఆ విలన్ కన్ను హీరో, హీరోయిన్ల మీద పడుతుంది. ఒక వైపు అమ్మాయి తండ్రి పంపించిన రౌడీలు, మరోవైపు డార్క్ వెబ్ మాఫియా తో కొత్త జంట ఉక్కిరిబిక్కిరి అవుతారు? మరి ఈ సమస్యల నుంచి కొత్త జంట ఎలా బయటపడింది? తమ ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారన్నదే ఈ సినిమా కథ.
ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘సత్తేంద్రు మారుదు వానిలై’ (Sattendru Maarudhu Vaanilai ). బాబు విజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో జర్నీ ఫేమ్ హీరో జై ప్రధాన పాత్రలో నటించాడు. అలాగే మీనాక్షి గోవిందరాజన్, యోగి బాబు ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. ప్రస్తుతం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
Winning hearts everywhere! ❤️✨
Sattendru Maarudhu Vaanilai is now trending at #10 in Drama Movies on Prime Video. 🎬
Now streaming in Tamil, Telugu, and Hindi. pic.twitter.com/BBBhY5HCy6
— AP International (@APIfilms) June 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి