OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన లేటేస్ట్ హిట్స్.. తెలుగులోకి మలయాళీ హారర్.. ఎక్కడ చూడొచ్చంటే..

ఓటీటీల్లోకి నిత్యం కొత్త కొత్త సినిమాలు అందుబాటులోకి వస్తున్న సంగతి తెలిసిందే. హారర్, కామెడీ, రొమాంటిక్ జానర్ చిత్రాలకు రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరో రెండు సూపర్ హిట్ చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చాయి. ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ హారర్ సినిమా ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన లేటేస్ట్ హిట్స్.. తెలుగులోకి మలయాళీ హారర్.. ఎక్కడ చూడొచ్చంటే..
Ott Movies

Updated on: Dec 05, 2025 | 11:44 AM

ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. గత అర్దరాత్రి నుంచి మూవీ లవర్స్ కోసం సరికొత్త కంటెంట్ చిత్రాలను రిలీజ్ చేశారు. అందులో జటధార ఒకటి. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఇప్పుడు ఆకస్మాత్తుగా ఓటీటీలోకి వచ్చేసింది. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్‌ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేశ్ కుమార్ నిర్మించారు. నవంబర్ 7న విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి : Shhyamali De: నిద్రలేని రాత్రులు గడుపుతున్నా.. నా బాధను అర్థం చేసుకోండి.. రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్..

ధన పిశాచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు 20 కోట్లతో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమాతోపాటు లేటేస్ట్ సూపర్ హిట్ డీయాస్ ఈరే సినిమా సైతం విడుదలైంది. మలయాళ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన డీయస్ ఈరే సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. భ్రమయుగం, భూతకాలం హిట్ మూవీస్ చేసిన డైరెక్టర్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రాన్ని తెరెకక్కించారు.

ఇవి కూడా చదవండి : Actress : ఆ పని నేను చేయలేదు.. అందుకే నాకు ఆఫర్స్ రావడం లేదు.. హీరోయిన్ స్నేహా ఉల్లాల్..

మలయాళం భాషలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ.. ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన 6రోజుల్లోనే దాదాపు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : అబ్బ సాయిరాం.. ఒక్క మాటతో టాప్ 5కు.. ఓటింగ్‏లో దుమ్ములేపుతున్న డేంజర్ జోన్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ అయ్యేది..