
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలకు ఈ మధ్యన మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా ఓటీటీలో ఇలాంటి రియల్ స్టోరీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం చర్చించుకోబోయేది కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. కేరళ త్రిస్సూర్ లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. త్రిస్సూర్ తో పాటు కేరళ రాష్ట్రం మొత్తాన్ని ఈ కేసు కుదిపేసింది. ఈ సంఘటనకు కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. కథ విషయానికి వస్తే.. ప్లాంటర్ శామ్యూల్ ఉమ్మన్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదంగా చనిపోతాడు. అందరూ దీనిని యాక్సిడెంట్ అనుకుంటారు. అయితే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని ఆధారాలను చూసి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ మాత్రం ఇది ప్రమాదం కాదని భావిస్తాడు. షాజీ అనే ఒక ఆటో డ్రైవర్ ను అనుమానిస్తాడు. అయితే అనూహ్యంగా ఆ ఆటో డ్రైవర్ కూడా ఒక క్వారీ ప్రమాదంలో చనిపోతాడు. అక్కడ దొరికిన ఆధారాలతో ఫ్రాన్సిస్ అనే వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు భావిస్తారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి అది రోడ్డు యాక్సిడెంటేనా? కాదా? మర్డర్ అయితే ఎవరు చంపారు? పోలీసుల విచారణలో చివరకు ఏం తేలింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠరేపే సీన్స్, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సిరీస్ పేరు కమ్మటం. షాన్ తులసీధరన్ తెరకెక్కించిన ఈ సిరీస్ లో ఓజీ నటుడు సుదేవ్ నాయర్ ప్రధాన పాత్రలో మెరిశారు. అలాగే జిన్స్, జియో బేబీ, అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరే, జోర్డీ పూంజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ కేవలం ఒరిజినల్ మలయాళ వెర్షన్ లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను చూడాలనుకునేవారిక ఇది ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
Watch only on Zee5..#Kammattam #WatchOnZEE5 #Zee5Malayalam pic.twitter.com/ice0Ra0A06
— ZEE5 Malayalam (@zee5malayalam) September 18, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.