OTT Movie: చూడ్డానికి యాక్సిడెంట్లే కానీ మర్డర్స్.. ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్ మూవీ

మీకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలో మంచి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే..కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఉత్కంఠ కలిగించే సీన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చింది.

OTT Movie: చూడ్డానికి యాక్సిడెంట్లే కానీ మర్డర్స్.. ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్ మూవీ
OTT Movie

Updated on: Mar 29, 2026 | 10:55 AM

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఈ మధ్యన వరుసగా రెండు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. అందులో ఎంటర్ టైన్మెంట్ జానర్ లో తెరకెక్కిన విష్ణు విన్యాసం ప్రేక్షకులను మంచి వినోదాన్నే అందించింది. అయితే దీని తర్వాత తన రొటీన్ జానర్ ను వదిలిపెట్టి శ్రీ విష్ణు చేసిన సినిమా ‘మృత్యుంజయ్’. పేరుకు తగ్గట్టుగానే ఇదొక ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్. దర్శకుడు హుస్సేన్ షా కిర‌ణ్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇందులో రెబా మోనికా జాన్‌, వీర్ ఆర్య‌న్‌, చిన్నా, సుద‌ర్శ‌న్‌, ర‌చ్చ ర‌వి, బాలాదిత్య తదితరులు నటించారు. మార్చి 06న విడుదలైన ఈ సినిమా మంచి గానే ఆడింది. ఆకట్టుకునే కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఇప్పుడీ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీ విష్ణు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్ 3 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో మృత్యుంజయ్ ను అధికారికంగా ప్రకటించింది.

రమ్య గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి మృత్యుంజయ్ చిత్రాన్ని నిర్మించారు.కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. క్రైమ్ బ్యూరోలో రిపోర్టర్‌గా వర్క్ చేయాలనేది జై (శ్రీవిష్ణు) కల. కానీ ఛాన్స్ రాక యాడ్స్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తుంటాడు. ఎవరైనా చనిపోయినట్లు తెలిస్తే వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి చనిపోయిన వాళ్ల గురించి సీక్రెట్‌గా తెలుసుకుని వాళ్ల కుటుంబ సభ్యుల దగ్గర తన గొప్పలు చెప్పుకొని మరీ యాడ్స్ సేకరిస్తుంటాడు. అలా అచ్యుత్ రావు (బాలాదిత్య) చనిపోయిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్తాడు. అంతలోనే మరో వ్యక్తి అచ్యుత్‌లానే చనిపోతాడు. అయితే ఈ మరణాల వెనక అంతుచిక్కని ఓ మిస్టరీ ఉంటుంది. ఇదే క్రమంలో ఐపీఎస్ అధికారిణి సీతా పరశురాం (రెబా మోనికా) ఈ మర్డర్స్ మిస్టరీని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతుంది. మరి ఈ హత్యలు ఎవరు, ఎందుకు చేశారు? జై ఆ క్రిమినల్స్ ను ఎలా కనిపెట్టాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో మృత్యుంజయ్ సినిమా..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us