OTT Movie: పల్లెటూరిలో పరువు హత్య.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. ఐఎమ్‌డీబీలో 9.4/10 రేటింగ్

సమాజంలో అల్లుకు పోయిన కుల వివక్ష నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. విమర్శలకు ప్రశంసలతో పాటు ఐఎమ్ డీబీలో ఏకంగా 9.4 రేటింగ్ వచ్చింది.

OTT Movie: పల్లెటూరిలో పరువు హత్య.. ఇవాళే ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా.. ఐఎమ్‌డీబీలో 9.4/10 రేటింగ్
Dhandoraa movie

Updated on: Jan 14, 2026 | 5:36 PM

సంక్రాంతి పండగను పురస్కరించుకుని థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఒక తెలుగు సినిమా ఇవాళే (జనవరి 14) ఓటీటీలోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, కుల వివక్ష వంటి సున్నితమైన అంశాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కూడా బాగా చేయడంతో ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే వచ్చాయి. అలాగే నటీనటుల న్యాచురల్ యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని తుళ్లూరు అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో కుల వివక్ష బాగా వేళ్లూనుకుపోయి ఉంటుంది. అలాంటిది అగ్ర కులానికి చెందిన ఓ పెద్ద మనిషి చనిపోతే ఆయన శవాన్ని అగ్రకుల స్మశాన వాటికలో దహనం చేయడానికి వీల్లేదని ఆ కుల పెద్దలు అడ్డుతగులుతారు. దీంతో అతని కుమారుడు, కూతురు కలిసి పోరాటం మొదలు పెడతారు. అసలు సొంత కులమే ఆ పెద్ద మనిషిని ఎందుకు వెలివేసింది? అంతకు ముందు ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? చివరికి ఆయన అంత్యక్రియలు ఎలా ముగిశాయి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

బలగం తరహా కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా పేరు దండోరా. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో నటించారు. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా ప్రమోషన్లలోనే శివాజీ చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సంక్రాంతి సెలవుల్లో ఓ మంచి ఫీల్ గుడ్ సినిమాను చూడాలనుకునేవారికి దండోరా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

అమెజాన్ ప్రైమ్  లో స్ట్రీమింగ్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.