Jetlee OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న సత్య కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే

టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సత్య. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అతను ఆ తర్వాత కమెడియన్ గా మారాడు.ఇన్ని రోజులు కమెడియన్ గా నటించి మెప్పించిన సత్య ఇటీవలే జెట్లీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Jetlee OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న సత్య కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే
Jetlee

Updated on: May 18, 2026 | 6:51 AM

ఓటీటీలో కొత్త సినిమాల సందడి మొదలైంది. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయ్. థియేటర్స్ లో విడుదలైన నెలరోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి సినిమాలు. రిజల్ట్ ను బట్టి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి కొన్ని సినిమాలు. హిట్ అయితే కొంచం ఆలస్యంగా.. అదే హిట్ అయితే కాస్త త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ కామెడీ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జెట్ లీ.. మత్తువదలరా సినిమా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రితేష్ రానా.  మత్తువదలరా, ఆతర్వాత వచ్చిన మత్తువదలరా 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రితేష్.. కమెడియన్ సత్యను ప్రధాన పాత్ర చేసుకొని జెట్ లీ సినిమాను తెరకెక్కించాడు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మంచి బజ్ క్రియేట్ చేసి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా తొలి ఆటకే పూర్తిగా తేలిపోయింది. ఈ సినిమా మే 01న థియేటర్లలోకివచ్చింది జెట్ లీ. ఇక ఈ సినిమాలో సత్య, వెన్నెల కిశోర్, రియా సింఘా ప్రధానపాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. సినిమా విడుదలైన నెలరోజుల లోకే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానుంది. జెట్ లీ’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ కైవసం చేసుకుంది. మే 25 తేదీ నుంచి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

బ్యాంక్ అధినేత అయిన ప్రజాపతి (అజయ్) సుమారు 15 వేల కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడి తన సంస్థను కావాలనే దివాళా తీయిస్తాడు. ఈ భారీ మోసగాడిని పట్టుకునే బాధ్యతను స్పెషల్ ఏజెంట్ శివానీ రాయ్ (రియా సింఘా) తీసుకుంటుంది. దుబాయ్లో తలదాచుకున్న అతడిని ప్రాణాలతో పట్టుకుని ఒక ప్రత్యేక విమానంలో కొచ్చికి తరలించే పనిలో ఆమె ఉంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో తన గతాన్ని పూర్తిగా మర్చిపోయిన డాక్టర్ వేద్ వ్యాస్ (సత్య) కూడా అనుకోకుండా అదే విమానంలో ప్రయాణిస్తూ ఉంటాడు.ఆ తర్వాత అంతా గందరగోళం నెలకొంటుంది. చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అసలు వెన్నెల కోశోర్ ఎవరు.? అసలు సత్య ఫ్లాష్ బ్యాక్ ఏమిటి.? చివరకు ఈ వ్యవహారం మొత్తం ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయాల చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us