
ఎప్పటిలాగే ఈ శుక్రవారం (ఆగస్టు 08) ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. అఖిల్ అక్కినేని లెనిన్, తిరువీర్- ఐశ్వర్యా రాజేష్ ల ఓ సుకుమారి, ఎంఆర్పీ వంటి తెలుగు సినిమాలతో పాటు హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. అయితే వీటిలో ఓ క్రైమ్ థ్రిల్లర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే టీజర్, ట్రైలర్ తోనే ఈ సిరీస్ హాట్ టాపిక్ గామారింది. ప్రమోషన్ కంటెంట్ లో చూపించిన సన్నివేశాలు, డైలాగులతో ఈ సిరీస్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. గ్రామంలో జరిగే వరుస హత్యలు… ఆ మర్డర్స్ మిస్టరీ ఛేదించే క్రమంలో ఓ అమాయకుడిని బలి చేయడం అనే పాయింట్ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. తమిళనాడు లోని మధురై నేపథ్యంలో ఈ సిరీస్ మొదలవుతుంది. ప్రశాంతంగా ఉండే ఆ ఊరిలో తలలు లేని అస్థిపంజరాలు, తెగిపడిన చేతులు బయటపడడం సంచలనంగా మారుతుంది. దీంతో ఈ కేసును సిన్సియర్ పోలీసాఫీసర్ మూసా రాజా టేకప్ చేస్తాడు. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొలదీ ఊహించని విషయాలు, ట్విస్టులు బయటపడతాయి. మరి ఈ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు ఇంత దారుణంగా చంపేశారు? ఈ కేసును మూసా రాజా ఎలా సాల్వ్ చేశాడు? అనేది తెలియాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు వదంది (Vadhandhi) సీజన్ 2. కొన్నేళ్ల క్రితం సూపర్ రెస్పాన్స్ అందుకున్న వదంది సిరీస్ కు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించగా కోలీవుడ్ హీరో శశికుమార్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే అపర్ణదాస్, అనఘా, వివేక్ ప్రసన్న, యశ్వంత్, రేవతి శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ సిరీస్ చూడాలనుకునేవారికి వదంది సీజన్ 2 బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
wrong case, wrong man, but the right time to fight for the mystery of mani is now 👀#VadhandhiOnPrime, New Season, Watch Now https://t.co/HlZCs3vxFK@Sasikumardir @andrewxvasanth @PushkarGayatri @wallwatcherfilm @AnaghaOfficial @aparnaDasss @actorvivekpra @YashwanthOffl… pic.twitter.com/EvCSZ1017L
— prime video IN (@PrimeVideoIN) August 6, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.