
సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన సినిమా ‘మా ఇంటి బంగారం’. గతంలో సమంతతోనే జబర్దస్త్, ఓ బేబీ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన నందిని రెడ్డి ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అందుకు తగ్గట్టుగానే సమంత సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన మా ఇంటి బంగారం సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణ ఫలించింది. మా ఇంటి బంగారం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. జులై 17 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించింది ఆ సంస్థ. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే జియో హాట్ స్టార్ లో సమంత సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో సమంత సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Bangaaram has found her way home… now it’s your turn to welcome her! 💗
Now welcome the Queen home with JioHotstar! 🏡#MaaIntiBangaaram streaming now on JioHotstar! 💫#MaaIntiBangaaramOnJioHotstar@Samanthaprabhu2 @TralalaPictures #RajNidimoru #NandiniReddy @himankd… pic.twitter.com/9yEbY2VIaO
— JioHotstar Telugu (@JioHotstarTel_) July 16, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.