Cinema OTT: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సినిమా.. తెగ చూస్తున్న జనాలు..

థియేటర్లలో అట్టర్ ప్లాప్ అయిన సినిమాలో ఓటీటీలో సూపర్ హిట్ కావడం సహజమే. తాజాగా మరో ప్లాప్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో బలంగా ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చాలా అంతగా స్పందన రాలేదు. కానీ ఇప్పుడు అదే మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రెండో స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది.

Cinema OTT: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి సినిమా.. తెగ చూస్తున్న జనాలు..
Ek Din

Updated on: Jul 22, 2026 | 10:05 AM

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య పెరిగిపోయింది. సస్పెన్స్, హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశ మిగిల్చిన చిత్రాలు ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అవుతున్నాయి. ఇదివరకు చాలా సినిమాలో ఓటీటీలో దుమ్మురేపాయి. ఇప్పుడు అలాంటి ఒక సినిమా ఓటీటీలో విడుదలైన వెంటనే టాప్ ట్రెండింగ్ జాబితాలోకి వచ్చేసింది. ఈ చిత్రం 2026 మే 1న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఇది బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది. ఈ సినిమా పేరు ‘ఏక్ దిన్’. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇందులో ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ , ప్రముఖ దక్షిణాది నటి సాయి పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రేమకథపై చాలా చర్చ జరిగింది, కానీ ఈ చిత్రం ప్రేక్షకుల , విమర్శకుల మనసులను గెలుచుకోవడంలో విఫలమైంది. ఫలితంగా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లు సాధించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Sudhakar : నేను కోమాలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వచ్చి చూసిన హీరో అతడే.. నటుడు సుధాకర్..

‘ఏక్ దిన్’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం అవుతోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుండి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు, ఈ కారణంగానే ఇది ప్రైమ్ వీడియోలోని టాప్ 10 ట్రెండింగ్ చిత్రాల జాబితాలో రెండవ స్థానానికి చేరుకుంది. ‘ఏక్ దిన్’ చిత్రం ఒక విదేశీ సినిమాకు కాపీ అని అన్నారు. ఇది 2016లో విడుదలైన ‘వన్ డే’ చిత్రానికి అధికారిక రీమేక్. జునైద్, సాయిల మధ్య కెమిస్ట్రీ తెరపై అంత స్పష్టంగా లేదని కొందరు విమర్శించారు.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Srikanth: ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. చాలా దెబ్బ పడింది.. హీరో శ్రీకాంత్..

అలాగే కథనంలో నెమ్మదితనం, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ఆశించిన స్థాయిలో కుదరకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కానీ జపాన్ బ్యాక్‌డ్రాప్, విజువల్స్ , సాయి పల్లవి నటనకు విమర్శకులు ప్రశంసలు వచ్చాయి.

ఎక్కువ మంది చదివినవి : ఎక్కువ మంది చదివినవి : Kota Srinivasa Rao : ఆ హీరోలగా చేయాలంటే ఇంకో జన్మ ఎత్తాలి.. ఆరోజు అతడి కష్టాన్ని కళ్లరా చూశా.. కోట శ్రీనివాస్ రావు..

Follow Us