Tiragabadara Saami OTT: ఓటీటీలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాల ప్రేమకథ .. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

|

Sep 15, 2024 | 6:52 AM

రిలీజుకు ముందే తిరగబడరా సామీ సినిమా బాగా వార్తల్లో నానింది. ప్రేమ పేరుతో త‌న‌తో ప‌దేళ్లు స‌హ‌జీవ‌నం చేసి రాజ్‌త‌రుణ్ మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి సదరు హీరోపై కేసు పెట్టింది. అలాగే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, అందుకే తనను దూరం పెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో సినిమా రిలీజ్ కు ముందే వీరిద్దరి పేర్లు అందరి నోళ్లల్లో నానాయి.

Tiragabadara Saami OTT: ఓటీటీలో రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రాల ప్రేమకథ .. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
Thiragabadara Saami Movie
Follow us on

యంగ్ హీరో రాజ్ తరుణ్ ఇటీవల వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అలా అతను తాజాగా నటించిన చిత్రం తిరగబడరా సామీ. ఇందులో రాజ్ తరుణ్ కు జోడీగా మాల్వీ మల్హోత్రా నటించింది. సీనియర్ డైరెక్టర్ ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ఈ సినిమాను తెరకెక్కించారు. కాగా రిలీజుకు ముందే తిరగబడరా సామీ సినిమా బాగా వార్తల్లో నానింది. ప్రేమ పేరుతో త‌న‌తో ప‌దేళ్లు స‌హ‌జీవ‌నం చేసి రాజ్‌త‌రుణ్ మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి సదరు హీరోపై కేసు పెట్టింది. అలాగే రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, అందుకే తనను దూరం పెట్టాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో సినిమా రిలీజ్ కు ముందే వీరిద్దరి పేర్లు అందరి నోళ్లల్లో నానాయి. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 2న విడుదలైన తిరగబడరా సామీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఔట్‌డేటెడ్ స్టోరీలైన్ తీసుకున్నారని నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో ఈ సినిమా పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. ఇప్పుడీ తిరగబడరా సామీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా తిర‌గ‌బ‌డ‌రా సామీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా సినిమా స్ట్రీమింగ్ పై కీలక ప్రకటన వెలువరించింది, ‘తిరగబడర సామి’ తమ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ లో స్ట్రీమింగ్ ​కు వస్తోందని ఆహా అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చింది. అయితే ఏ తేదీ నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందో మాత్రం చెప్పలేదు. కానీ సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తిరగబడరా సామీ సినిమాలో మన్నారా చోప్రా, మకరంద్ దేశ్ పాండే, ప్రగతి, బిత్తిరి సత్తి, రఘు బాబు, పృథ్వీరాజ్, తాగుబోతు రమేశ్, భద్రం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జేబీ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్..

ఆహాలోనే పురుషోత్తముడు స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.