
కొన్ని రోజుల క్రితం తమిళ్ లో విడుదలైన ఓ సినిమా ఆడియెన్స్ అందరినీ ఆలోచనలో పడేసింది. సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటలను ఇందులో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. కొన్ని సీన్లు బోల్డ్ గా ఉన్నాయని, బూతులు ఎక్కువగా విమర్శలు వచ్చినా కంటెంట్ పరంగా ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఈ సినిమా తెలుగులో రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. గత నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో ప్రధానంగా మూడు సెగ్మెంట్లుగా విభజించారు. సమాజంలో ఉన్న కొన్ని సీరియస్, సెన్సిటివ్ అంశాలను చర్చించారు. టాక్సిక్ ఫ్యాన్ కల్చర్ అంటే హీరోల పట్ల అభిమానం పిచ్చిగా మారితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనేది ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే స్వలింగ సంపర్కుల వివాహం చుట్టూ ఉన్న ప్రచారం.. మూడోది ఒక వ్యక్తి తనకు నచ్చిన బట్టలు వేసుకునే హక్కు, సమాజం చూసే చూపు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ప్రస్తుతం ఓటీటీ టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు హాట్ స్పాట్ టూ మచ్. గ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన ఈ బోల్డ్ మూవీలో ప్రియా భవాని శంకర్, ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, రక్షాన్, అశ్విన్ కుమార్, ఆదిత్య భాస్కర్, భవాని శ్రీ, బ్రిగిడా సాగా, సంజన తివారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓరిజినల్ వెర్షన్ అంటే తమిళ వెర్షన్ ఆరు ఓటీటీల్లో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళం, లయన్స్‌గేట్ ప్లే, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ ఓటీటీల్లో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Three bold stories.
One aspiring director.
And a hidden agenda you won’t see coming. 👀
Watch #Hotspot2Telugu now on #aha@vikikarthick88 @priya_Bshankar @i_amak @RakshanVJ @AadhityaBaaskar @Brigidasagaoffl @BhavaniSre pic.twitter.com/OMe9wvnN3J— ahavideoin (@ahavideoIN) March 4, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.