OTT Movie: హైదరాబాద్ దిశా రేప్ కేసు ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలోకి రియల్ క్రైమ్ స్టోరీ.. అధికారిక ప్రకటన
2019లో హైదరాబాద్ లో జరిగిన దిశా రేప్, నిందితుల ఎన్ కౌంటర్ తదితర వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ రియల్ క్రైమ్ థ్రిల్లర్ ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లే రాబట్టింది.

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. దుల్కర్ సల్మాన్ ఐ యామ్ గేమ్, బా బా బ్లాక్ షీప్, అనకాపల్లి, మీసయ్య మురుక్కు 2 లాంటి సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలాగే వివిధ భాషలకు చెందిన వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు ఆడియెన్స్ కు వినోదం అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో రియల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. 2019లో హైదరాబాద్ లో జరిగిన దిశా రేప్, నిందితుల ఎన్ కౌంటర్ తదితర సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. సలార్ తో మెప్పించి ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి లో విలన్ గా నటిస్తోన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో హీరోగా చేశాడు. అలాగే బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.
పృథ్వీరాజ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘దాయిరా’ (Daayra). గతంలో ఎన్నో నిజ జీవిత సంఘటలను వెండితెరపైకి తీసుకొచ్చిన మేఘనా గుల్జార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కరీనాతో పాటు ప్రగతి మిశ్రా, భవేష్ బబ్బాని, క్షితీ జోగ్, కన్వల్జిత్ సింగ్, అనూజా సాఠే తదితరులు కీలకపాత్రలు పోషించారు. నీత్ జైన్, ధవల్ గడా నిర్మించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దాయిరా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వెలువడింది. వచ్చే శుక్రవారం (నవంబర్ 13) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఒరిజినల్ వెర్షన్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.
నెట్ ఫ్లిక్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘దాయిరా’..
#Daayra (2026) by @meghnagulzar, premieres Nov 13th on @NetflixIndia.
#KareenaKapoorKhan @PrithviOfficial @JungleePictures https://t.co/w2q8juDHwv
— CinemaRare (@CinemaRareIN) November 7, 2026
దాయిరా సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




