OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్ భగత్‌సింగ్.. పవన్ కల్యాణ్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 16) అర్ధరాత్రి నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ఉస్తాద్ భగత్‌సింగ్.. పవన్ కల్యాణ్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Ustaad Bhagat Singh

Updated on: Apr 16, 2026 | 3:37 PM

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేన్ లో వచ్చిన రెండో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాశీ ఖన్నా మరో కీలక పాత్రలో మెరిసింది. కోలీవుడ్ నటుడు పార్తీబన్ ఈ మూవీలో ప్రతినాయకుడి గా నటించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యావరేజ్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ స్టైల్ యాక్షన్, మాస్, ఎలిమింట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే హరీశ్ శంకర్ మార్క్ డైలాగులు, శ్రీలీల, రాశీ ఖన్నా అంద చందాలు ఆడియెన్స్ ను మెప్పించాయి. అయితే కంటెంట్ పరంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కాస్త వీక్ అనిపించింది. దీనికి తోడు పోటీగా ధురంధర్ 2 సినిమా రిలీజ్ కావడం ఉస్తాద్ కు మైనస్ గా మారింది. దీంతో పవన్ కల్యాణ్ సినిమాకు ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. అయితే పవన్ కల్యాణ్ అభిమానులకు బాగా నచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఉస్తాద్ భగత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలో గురువారం (ఏప్రిల్ 16) అర్ధరాత్రి నుంచే పవన్ కల్యాణ్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.అలాగే తమన్ బీజీఎమ్ అందించారు. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ మ ఊవీ తొలిప్రేమ సినిమాలోని ‘ఈ మనసే ‘ సాంగ్ ను రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన ఉస్తాద్ ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us