
ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ ఉంటుంది. లవ్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్, క్రైమ్, హారర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఇప్పటి ఆడియెన్స్ ఎక్కువగా హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, సిరీస్ లనే చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ మలయాళం సినిమాలకైతే ఓటీటీలో ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమానే. కేరళలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. థియేటర్లలో ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆపై ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమా కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో హీరో నిజాయతీగల ఓ పోలీస్ ఆఫీసర్. ఓ అమ్మాయి మిస్సింగ్ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకోవడంతో అతను సస్పెండ్ అవుతాడు. అయితే, కొన్నాళ్లకు హీరో చేతికి మరో అమ్మాయి మర్డర్ కేసు వస్తుంది. తిరిగి విధుల్లో చేరి ఇన్వెస్టిగేషన్ చేపడతాడు. అయితే ఈ రెండు హత్య కేసులకు ఒక లింక్ ఉంటుంది. ఆనంద్ ఆ మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడు. కానీ వాటిని బయటపెట్టలేని పరిస్థితి ఎదురవుతుంది. నిందితుల గురించి తెలిసినా అరెస్ట్ చేయడు. మరి అమ్మాయిలను హత్య చేసిందెవరు? ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? అన్నదే ఈ సినిమా కథ.
2018 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు మలయాళం నటుడు టోవినో థామస్. అతను నటించిన ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అన్వేషిప్పిన్ కండేతుమ్’. డార్విన్ కురియకోస్ ఈ సినిమాను తెరకెక్కించారు. అతనితో పాటు వినీత్ డేవిడ్, రాహుల్ రాజగోపాల్, సిద్దిఖీ, షమ్మి తిలకన్, సాదిఖ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఫుల్లుగా ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అందులోనూ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసే వారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
Sathyam allannu orappulla kaaryathinu munnil kannadakattha SI Anand Narayanan 👀🚨
Anweshippin Kandethum, now streaming in Malayalam, Tamil, Telugu, Kannada and Hindi. #AnweshippinKandethumOnNetflix pic.twitter.com/QFAeHM7ueU
— Netflix India South (@Netflix_INSouth) March 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.