OTT Movie: పోలీసులే నిందితులైతే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ఈ దసరా సెలవుల్లో మంచి ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండ్ లో ఉన్న ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ మీకు బెస్ట్ ఆప్షన్. ఈజీగా అర్థం చేసుకోవడానికి తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

OTT Movie: పోలీసులే నిందితులైతే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie

Updated on: Oct 14, 2026 | 12:10 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఎన్న విలై, ద ట్రైటర్స్, ఆశా, కాగితం పడవలు, ఇ‍ట్స్ ఏ మెడికల్ మిరాకిల్ లాంటి సినిమాలు, సిరీస్ లు ఈ వీకెండ్ లో ఆడియెన్స్ కు వినోదం అందించనున్నాయి. అయితే గత వారం ఓటీటీలోకి వచ్చిన ఒక మలయాళం సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. రికార్డు స్ట్రీమింగ్ మినిట్స్ తో ఓటీటీని షేక్ చేస్తోంది. సాధారణంగానే మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో సస్పెన్స్, ట్విస్టులు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే ఈ సినిమాలో అవి ఇంకా నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. అందుకే ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాను ఇప్పుడు తెగ చూసేస్తున్నారు ఓటీటీ ఆడియెన్స్ . అంతకు ముందు థియేటర్లలోనూ ఈ సినిమా బాగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. కేవలం రూ. 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 7.5 రేటింగ్ లభించడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే..

కారుణ్య నియామకం కింద పోలీస్‌ ఉద్యోగం సంపాదించిన అలీనా అబ్రహాం (పార్వతి తిరువోతు) చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఓ పోలీస్‌ స్టేషన్‌లో నైట్ డ్యూటీ నిర్వహిస్తున్న కొందరు పోలీసుల చేతుల్లో అనుకోకుండా ఓ నేరం జరుగుతుంది. అయితే తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు వారు తమకున్న తెలివితేటలను, పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. ఆధారాలు దొరకకుండా చేస్తారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేసేందుకు సీనియర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి (విజయరాఘవన్‌) రంగంలోకి దిగుతారు. దీంతో నేరానికి పాల్పడిన పోలీసులకు, సీనియర్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారి మధ్య ఒక రకమైన మైండ్ గేమ్ నడుస్తుంది? మరి ఎవరికి తెలియకుండా చేసిన నేరాన్ని పోలీసులు ఎలా దాచారు? విజయరాఘవన్‌ వారి బాగోతాన్ని ఎలా బయటపెట్టారు? అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ పై ఒక నెటిజన్ రివ్యూ..

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ (Pradhama Drishtya Kuttakkar). షహద్ నీలాంబూర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పార్వతి తిరువోతు, మాథ్యూ థామస్, విజయరాఘవన్, వినయ్ ఫోర్ట్, సిద్ధార్థ్ భరతన్, ఉన్నిమాయ ప్రసాద్, అజీజ్ నెడుమంగాడ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

‘ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్’ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us