OTT Movie: ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్

ఈ వీకెండ్ లో ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లేదా వెబ్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే ఆద్యంతం ట్విస్టులతో సాగే మలయాళం మూవీ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు టాప్ రేటింగ్ ఉండడం గమనార్హం.

OTT Movie: ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్
OTT Movie

Updated on: Nov 08, 2026 | 9:42 PM

ప్రస్తుతం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉన్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు ఇప్పుడు ఆడియెన్స్ కు మంచి వినోదం అందిస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, అనకాపల్లి, మీసయ్య మురుక్కు 2 తదితర కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. అయితే వీటితో పాటు గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది. ఇదొక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఆద్యంతం ఆసక్తికరంగా థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమా ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. ఇక సినిమాలో వచ్చే ట్విస్టులు ఆడియెన్స్ మతిపోగొట్టాయని చెప్పవచ్చు. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ ఉండడం గమనార్హం. ఈ సినిమా స్టోరీ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక హాస్పిటల్ ఐసీయూ నేపథ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా ఈ చిత్రం సాగుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు, వారిని కాపాడటానికి వైద్యులు చేసే పోరాటం, అలాగే కుటుంబ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఆద్యంతం ఎమోషనల్ గా ఈ మూవీ సాగుతుంది. అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో మోరల్, ఎమోషనల్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నదే ఈ సినిమా ముఖ్య కథాంశం.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా పేరు ‘ICU’.. Until The Last Breath అనేది ఈ మూవీ క్యాప్షన్. దర్శకుడు జార్జ్ వర్గీస్ కథ తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో బిబిన్ జార్జ్, బాబూరాజ్, మురళీ గోపి, విస్మయ, మీరా వాసుదేవ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా గత శుక్రవారం (నవంబర్ 06)న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అప్పటి నుంచే ఈ సినిమా టాప్ లో ట్రెండ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం ఒరిజినల్ మలయాళం వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు స్ట్రీమింగ్ కు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఐసీయూ బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు.

ఐసీయూ సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us