
ప్రస్తుతం మలయాలం సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ ఓటీటీలో అయితే మాలీవుడ్ సినిమాలను తెగ చూసేస్తున్నారు. సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్.. ఇలా ఏ జానర్ సినిమా అయినా మలయాళం నుంచి వచ్చిందంటే చాలు వెంటనే చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇక ఈ మధ్యన రియల్ క్రైమ్ స్టోరీలకు కూడా మంచి ఆదరణ ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటోన్న సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమా. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలోనూ భారీ వ్యూస్ తెచ్చుకుంది. సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2015లో కేరళలో జరిగిన రియల్ నగల దోపిడీ కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి కథ అందించిన సీబీ థామస్ కూడా నిజ జీవితంలో ఒక పోలీస్ ఆఫీసర్ కావడం విశేషం. కేరళలోని కాసరగోడ్ జిల్లాలో ఈ కథ మొదలవుతుంది. ఒక పెద్ద ఆభరణాల దుకాణంలో అర్ధరాత్రి వేళ భారీ చోరీ జరుగుతుంది. సుమారు 1.5 కిలోల బంగారు నగలను దొంగలు దోచుకెళతారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభిస్తారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకదు. చివరకు ఈ కేసును ఛేదించేందుకు సీఐ సాజన్ ఫిలిప్ రంగంలోకి దిగుతాడు. దీంతో సాజన్ తన బృందంతో కలిసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. జ్యూవెలరీ షాప్ చోరీతో పాటు నగరంలో దొంగతనాలన్నీ చేసింది ఉత్తర భారతదేశానికి చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా అని గుర్తిస్తారు. దీంతో నిందితలను పట్టుకునేందుకు సాజన్ అండ్ టీమ్ ఉత్తరప్రదేశ్ – రాజస్థాన్ సరిహద్దులోని ఓ మారుమూల గ్రామానికి వెళుతుంది. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది.
కరుడుగట్టిన నేరుస్తులకు స్థావరమైన ఆ గ్రామంలోకి అపరిచిత వ్యక్తులు ఎవరు చ్చినా స్థానికులు కొట్టి చంపేస్తారు. దీనికి తోడు లోకల్ పోలీసులు కూడా సాజన్ టీమ్ కు ఎలాంటి సహాయ సహాకారాలు అందించరు. మరి నేరస్థుల గ్రామంలోకి సాజన్ టీమ్ ఎలా చొరబడింది? నిందితులను ఎలా అరెస్ట్ చేసింది? ఆ తర్వాత స్థానికుల నుంచి ఎలా తప్పించుకన్నారు? అన్నది తెలుసుకోవాలంటే కుట్టవుం శిక్షయుమ్’ (Kuttavum Shikshayum) సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కథ పరంగా చూస్తే కార్తీ నటించిన ఖైదీ సినిమా గుర్తుకు వస్తుంది. అయితే అందులో లాగే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.