OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఓటీటీలోకి వచ్చేసిన 35కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. వీటిని మిస్ అవ్వొద్దు
ఈ శుక్రవారం (అక్టోబర్ 10) థియేటర్లలోకి పలు కొత్త సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ చిన్న సినిమాలే. అందులోనూ ఒక్కదానిపై కూడా పాజిటివ్ బజ్ రాలేదు. అయితే ఓటీటీల్లో మాత్రం 35కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి.
ఈ వారం ఓటీటీ ఆడియెన్స్ కు పండగే. ఎందుకంటే ఈ వారం పెద్ద సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన సినిమాలతో పాటు కొత్త మూవీస్, ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్ కు వచ్చిన తెలగు సినిమాల్లో మిరాయ్, వార్ 2, లీగల్లీ వీర్, గది, త్రిబాణధారి బార్బరిక్ అందరి దృష్టిని ఆకర్షిస్తు్న్నాయి. అలాగే జాన్వీ కపూర్ హిందీ సినిమా పరమ్ సుందరి కురుక్షేత్ర, సెర్చ్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడాఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి.