Telugu News Entertainment Ott List of Movies and web series releasing in OTT platforms for Sankranti 2023, Full details Telugu Cinema News
OTT: సంక్రాంతికి సందడే సందడి.. ఓటీటీల్లో పెద్ద ఎత్తున రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు.. పూర్తి వివరాలివే
పండగ సమయంలో అందరూ థియేటర్లకు వెళ్లలేరు. పిండివంటలు చేసుకుని ఎంచెక్కా ఇంట్లోనే నచ్చిన సినిమా చూడవచ్చని భావించేవారు చాలామందే ఉంటారు. ఇందుకోసమే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్ చేయనున్నాయి. ఆసక్తికకరమైన వెబ్‌సిరీస్‌లను అందుబాటులో ఉంచనున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంతో ప్రత్యేకం. ఈ పండగకు రిలీజయ్యే సినిమాలకు కాస్త హిట్ టాక్ వచ్చినా చాలు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. అందుకే దర్శక నిర్మాతలందరూ పొంగల్ సీజన్‌లో తమ సినిమాలు విడుదల చేసేందుకు పోటీపడుతుంటారు. అలా ఈసారి కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో పాటు వారసుడు, తెగింపు లాంటి డబ్బింగ్ మూవీలు సంక్రాంతికి సందడి చేయనున్నాయి. వీటితో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. అయితే పండగ సమయంలో అందరూ థియేటర్లకు వెళ్లలేరు. పిండివంటలు చేసుకుని ఎంచెక్కా ఇంట్లోనే నచ్చిన సినిమా చూడవచ్చని భావించేవారు చాలామందే ఉంటారు. ఇందుకోసమే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలను రిలీజ్ చేయనున్నాయి. ఆసక్తికకరమైన వెబ్‌సిరీస్‌లను అందుబాటులో ఉంచనున్నాయి. మరి జనవరి 2 వారంలో ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.