
లెజెండ్ శరవణన్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లీడర్’. ఆర్ ఎస్ దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. శ్యామ్, ఆండ్రియా, సంతోష్ ప్రతాప్, లాల్, బాహుబలి ప్రభాకర్, వీటీవీ గణేశ్, అమృత అయ్యర్, ఐశ్వర్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. లెజండ్ శరవణ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కథ, కథనాల పరంగా పెద్దగా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయలేకపోయింది. రొటీన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా అన్న రివ్యూలు వినిపించాయి. అయితే లెజెండ్ సినిమాతో పోల్చుకుంటే లీడర్ సినిమా కొంచెం బెటర్ అన్న కామెంట్స్ వచ్చాయి. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన లీడర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. లీడర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో మే 08 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడనుంది.
లీడర్ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక స్పై యాక్షన్ థ్రిల్లర్. తూత్తుకుడి పోర్టు నేపథ్యంలో సాగుతుంది. ఒక మాజీ రా ఏజెంట్ అనుకోని సంఘటనల వల్ల రహస్యంగా బతకాల్సి వస్తుంది. ఈ క్రమంలో పోలీస్ కారణంగా కూతురు ప్రాణాలు ప్రమాదంలో పడటం, దాంతో అజ్ఞాతవాసాన్ని వీడి పోరాడటం వంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. స్టోరీ రోటీన్ గా ఉన్నా సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. అలాగే తండ్రి కూతుళ్ల బంధానికి సంబంధించి వచ్చే సీన్స్ ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు లీడర్ పై ఒక లుక్కేసుకోవచ్చు.
📢 Update: Theatrical Run Extended!#LegendSaravanan’s LEADER is set to continue its theatrical run for two more weeks 🎬🔥
OTT release is expected to begin from May 15 on Primevideo 🍿#OTT_Trackers https://t.co/zVmGNDsK6Y pic.twitter.com/A4a6ckPbSJ
— OTT Trackers (@OTT_Trackers) April 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.