
కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మార్క్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే కథ చాలా బలహీనంగా ఉందని, ట్విస్టులు కూడా ఊహించినట్లే ఉన్నాయని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే సుదీప్ క్రేజ్ తో ఈ మార్క్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనవరి 23 నుంచి మార్క్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లోనూ సుదీప్ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
‘మార్క్’ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కింది. గతంలో మ్యాక్స్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ కార్తికేయ నే ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హీరో సుదీప్ సరసన నిశ్వికా నాయుడు, రోషిక హీరోయిన్లు గా నటించారు. అలాగే యోగి బాబు, మలయాళం షైన్ టామ్ చాకో, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో నటించారు. . సత్యజ్యోతి క్రియేషన్స్, సుదీప్ సొంత నిర్మాణ సంస్థ కిచ్చా క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. అలాగే సుదీప్ కూతురు సాన్వి కూడా ఈ సినిమా పంపిణీలో చేతులు కలపడం విశేషం.
#MarkTheFilm (Kannada) will premiere
on JioHotstar, 23rd January.#KicchaSudeep #MARK pic.twitter.com/XUAKMI8sw3— OTT Gate (@OTTGate) January 16, 2026
తెలుగులోనూ స్ట్రీమింగ్..
Despite the tight deadline, #MarkTheMovie‘s final output is stunning @KicchaSudeep sir.
The quality of the movie surpasses #MaxTheMovie. Your style & swag, combined with @shivakumarart production design and @shekarchandra71 cinematography, make it truly worth watching. Congrats… pic.twitter.com/59Bi5SR7JG— Shashank (@Shashank_dir) December 28, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..